జిన్‌పింగ్ అలక?- ప్రధాని మోదీ ఇచ్చిన గ్రాండ్ డిన్నర్ కు డుమ్మా
దేశ రాజధానిలో ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ దేశాల అధినేతలు, బ్రిక్స్ ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కాలేదు. ప్రపంచస్థాయి నాయకులందరూ ఒకే వేదికపై కలిసిన ఈ కీలక సమయంలో ఆయన విందుకు దూరం కావడం చర్చనీయాంశమైంది.
ఆయన ఈ విందుకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయంపై చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడించలేదు. సుదీర్ఘ ప్రయాణం, బిజీ షెడ్యూల్ వల్ల ఏర్పడిన అలసట కారణంగానే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి నేరుగా తాను బస చేసిన హోటల్ కు బయలుదేరి వెళ్లినట్లు చెబుతున్నారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి గానీ, ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గానీ ఎలాంటి వివరణ వెలువడలేదు.

ఆయన గైర్హాజర్ కావడం అనేక ప్రశ్నలకు తెర తీసినట్టయింది. సరిహద్దు సమస్యలపై ఏకాభిప్రాయం కుదరలేదంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రధాని మోదీ మౌఖికంగా చేసిన కొన్ని ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకించారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.
అదే సమయంలో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ కూడా మోదీ ఇచ్చిన ఈ డిన్నర్ కు డుమ్మా కొట్టారు. బ్రిక్స్ సదస్సు ముగిసిన వెంటనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరి వెళ్లిపోయారు. అక్కడ కొన్ని అత్యవసర సమావేశాలు ఉన్నందున ఆయన కూడా ఈ విందులో పాల్గొనలేకపోయారని తెలుస్తోంది. దీనిపైనా యూఏఈ నుంచి అధికారిక ప్రకటన రాలేదని చెబుతున్నారు.
కాగా.. జిన్‌పింగ్ గైర్హాజరైనప్పటికీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు బ్రిక్స్ కూటమికి చెందిన ఇతర సభ్య దేశాల అగ్రనేతలు, ప్రతినిధులు ఈ గాలా డిన్నర్‌లో పాల్గొన్నారు. ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విందుకు హాజరయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడణవీస్, సువేందు అధికారి, హిమంత బిస్వ శర్మ.. ఇందులో పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications
