బిహార్​ 'పవన్ కల్యాణ్'​ ఇతనే..!

ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. కూటమి నేతలు కూడా ఊహించని విధంగా బిహార్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. కూటమిలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ పార్టీలు విజయ దుందుభి మోగిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ పార్టీలకు ధీటుగా లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) కూడా ఎన్నికల ఫలితాల్లో అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 90 శాతం స్ట్రైక్ రేటుతో దూసుకెళ్తుంటే.. యువ పార్టీ ఎల్జేపీ సైతం చిరాగ్ పాసవాన్ సారధ్యంలో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విక్టరీ కొట్టింది. ఈ అఖండ విజయంలో ఆ పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. గత ఎన్నికల్లో ఒక్కటంటే.. ఒక్క స్థానానికే పరిమితమైన ఎల్జేపీ పార్టీ.. ఈ ఎన్నికల్లో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. దాదాపు 209 సీట్లతో ముందంజలో ఉంది. కూటమిలోని బీజేపీ, జేడీయూలకు ఏమాత్రం తీసిపోకుండా ఎల్జేపీ అద్భుత ప్రదర్శన చేసింది. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 75 శాతం స్ట్రైక్‌ రేటు సాధించి సత్తా చాటింది. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ సారథ్యంలో బిహార్ రాజకీయాల్లో పార్టీ మరింత శక్తివంతంగా మారింది. 2020 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న ఎల్జేపీ.. ఈ ఎన్నికల్లో దాదాపు 75 శాతం స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపింది. మొత్తం 29 అసెంబ్లీ స్థానాల్లో ఎల్ జేపీ పోటీ చేస్తే 19 స్థానాల్లో లీడ్ గా ఉంది. గతంలోనూ ఎల్జేపీ పార్టీ పోటీ చేసిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలనూ కైవసం చేసుకుంది. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Chirag Paswan Bihar s New Pawan Kalyan with 77 Strike Rate NDA s Superstar

2020 ఎన్నకల్లో ఎల్జేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ తో విబేధాల కారణంగా సింగిల్ గానే ఎన్నికల్లో పోటీ చేసింది. 130 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కానీ కేవలం 1 సీటు మాత్రమే సాధించింది. ఆ సమయంలో పార్టీ పనైపోయిందని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ ఐదేళ్లు తిరగకుండానే ఎల్జేపీ పార్టీ తన సత్తా ప్రదర్శించింది. తండ్రి రామ్ విలాస్ పాసవాన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిరాగ్‌ పాసవాన్.. వరుస ఎన్నికల్లో దుమ్ములేపుతున్నారు. తాజాగా బిహార్‌లో ఎన్నికల్లోనూ చిరాగ్‌ పార్టీ విజయదుంధుభి మోగించిన నేపథ్యంలో ఈ విజయాన్ని జనసేన పార్టీ గెలుపుతో పోలుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+