'లంచం తీసుకుంటే చేతులు నరికేయండి' : గోవా ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

Subscribe to Oneindia Telugu

గోవా : బిచోలిం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర్య ఎమ్మెల్యే నరేష్ సవాల్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లంచం తీసుకునే అధికారుల చేతులు నరికేయాలంటూ' అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

అవినీతికి సంబంధించిన కేసుల్లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అసంత్రుప్తి వ్యక్తం చేసిన ఆయన.. అవినీతి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం సీరియస్ గా వ్యవహరించినా..! 'లంచం తీసుకునేవాళ్ల చేతులు నరికేయాలంటూ' ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం నాడు జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే నరేష్ సవాల్. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపించిన ఆయన అవినీతిని అరికట్టడంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందన్నారు.

Chop off hands of corrupt officers, says Goa MLA Naresh Sawal

కాగా ఎమ్మెల్యే నరేష్ సవాల్ వ్యాఖ్యలపై స్పందించిన గొవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. అలాగే ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో నేరస్తులను శిక్షించడానికి చట్టాలున్నాయని, నేరం రుజువైతే నేరస్తుల శిక్షను చట్టాలు చూసుకుంటాయని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Goa's independent MLA from Bicholim Naresh Sawal on Tuesday said the hands of the officials caught red-handed while taking bribes should be cut off.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి