బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరుకు వరుణ్ సింగ్ ఎయిర్‌లిఫ్ట్: బిపిన్ రావత్ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి పర్వతాల్లో వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక అధికారి, గ్రూప్ కేప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యం విషమంగానే ఉంది. వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఎయిర్ అంబులెన్స్‌లో ఆయనను బెంగళూరుకు తీసుకెళ్లారు. వైమానిక దళానికి చెందిన కమాండ్ ఆసుపత్రిలో ఆయనను అడ్మిట్ చేశారు.

Summit for Democracy: ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలివే: బైడెన్‌తో ప్రధాని మోడీ వర్చువల్ భేటీ

వరుణ్ సింగ్ ఆరోగ్యం విషమంగానే ఉందని, ఆయనకు కనీసం మూడు శస్త్ర చికిత్సలను చేయాల్సి ఉంటుందని కోయంబత్తూర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. ఆయనకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్పారు. వరుణ్ సింగ్ ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారంటూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. వరుణ్ సింగ్‌ను మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తామని ఆయన తండ్రి, రిటైర్డ్ కల్నల్ కేపీ సింగ్ ధృవీకరించారు.

 Chopper crash lone survivor Group Captain Varun Singh airlifted to Bengaluru for better treatment

సుళ్లూర్-కూనూర్ మధ్య ఈ అత్యాధునిక హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది కన్నుమూశారు. వరుణ్ సింగ్ ఒక్కరే గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంటోంది. కాగా- దేశ రాజధానిలోని కంటోన్మెంట్ ఏరియాలోని బ్రార్ స్క్వేర్ వద్ద బిపిన్ రావత్, మధులిక రావత్, ఇతర అధికారుల భౌతిక కాయాలను ప్రజల సందర్శనార్థం ఉంచారు.

రాజ్‌నాథ్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జాతీయ భధ్రత సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాధిపతులు మనోజ్ ముకుంద్ నరవణె (ఆర్మీ), నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, వైమానిక దళాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి నివాళి అర్పించారు. ఈ ఉదయం ఆయన భౌతిక కాయాన్ని బ్రార్ స్క్వేర్ వద్దకు తీసుకొచ్చారు. తొలుత మనోహర్ లాల్ ఖట్టర్ ఆ తరువాత అధికారులు నివాళి అర్పించారు. ఆయన సేవలను స్మరించారు.

Recommended Video

Sanjay Bangar named head coach of Royal Challengers Bangalore

English summary
Group Captain Varun Singh, the lone survivor of the Indian Air Force (IAF) chopper crash that resulted in the death of Chief of Defence Staff General Bipin Rawat, his wife and 11 others, is critical and has been airlifted to Bengaluru for better treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X