వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌ను చోర్ అన్న నిర్మలా సీతారామన్, ఆ లిక్కర్ ఏఏపీ అభ్యర్థిదే

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవినీతి పైన వారిని ఎవరు విచారించాలనే విషయం దొంగలకు నిర్ణయించే అధికారం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పైన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ పైన విచారణ జరిపించుకోవచ్చునని చెప్పారు. ఈ రోజు సాయంత్రం లోగా బీజేపీ తమ పైన విచారణకు ఆదేశించకుంటే తామే విచారణ సంస్థలను ఆశ్రయిస్తామని ఏపీ నేత చెప్పారు.

దీనికి బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. నిర్మలా సీతారామన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమను ఎవరు విచారించాలో దొంగలు నిర్ణయించకూడదని ఆమ్ ఆధ్మీ పార్టీకి సూచించారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల పైన ఏఏపీ నేత అశుతోష్ స్పందించారు. కేజ్రీవాల్‌ను నిర్మలా సీతారామన్ దొంగ అని పేర్కొనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, వారు అలాంటి రాజకీయంలో ఉన్నారని కౌంటర్ ఇచ్చారు.

'Chor' can't decide who will investigate him, Nirmala Sitharaman tells AAP

అరవింద్ కేజ్రీవాల్ పైన బీజేపీ అవినీతి కార్టూన్లు

ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పైన బీజేపీ అవినీతి కార్టూన్ల అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తంది. ఏఏపీ వాలంటీర్ యాక్షన్ మంచ్ (అవమ్) ఏఏపీ పైన తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ కార్టూన్లు ప్రదర్శిస్తోంది. ఈ కార్టూన్లలో పలువురు ఇస్తున్న నల్లధనాన్ని నిధుల రూపంలో కేజ్రీ తెల్లధనంగా మార్చుకుంటున్నట్లు కార్టూన్ బొమ్మలను ప్రకటనలలో బీజేపీ చిత్రీకరించింది.

ఆ లిక్కర్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినది!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. కొద్ది రోజుల క్రితం తాము పట్టుకున్న లిక్కర్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినదిగా గుర్తించినట్లు ప్రకటించారు. అది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నరేష్ బల్యాన్‌కు చెందినదని తెలిపారు.

English summary
The war of words between BJP and AAP over political funding hit a new low on Tuesday with Union minister Nirmala Sitharaman on Tuesday saying, "A chor (thief) cannot decide who will investigate him."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X