వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

130 కోట్ల ప్రజలు నావైపే ఉన్నారు: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

మీరట్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ వేదికగా ప్రచార కదన రంగంలోకి దూకారు. మీరట్ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోడీ.. 45రోజుల పాటు సుడిగాలి పర్యటనలతో హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. తొలి సభలోనే కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన ప్రధాని.. ప్రతిపక్షాల లెక్కలు తేలుస్తానని హెచ్చరించారు.

అందరి లెక్కలు తేలుస్తా

అందరి లెక్కలు తేలుస్తా

మీరట్ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిందేమీలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని మోడీ మండిపడ్డారు.

నవభారత నిర్మాణమే బీజేపీ విజన్

నవభారత నిర్మాణమే బీజేపీ విజన్

ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అందుకే 130 కోట్ల మంది భారతీయులు మళ్లీ బీజేపీకే అధికారం కట్టబెట్టాలని భావిస్తున్నారని అన్నారు. తాను చౌకీదార్‌నని, అన్యాయం చేయడం తనకు తెలియదన్న ఆయన.. ప్రతిపక్షాల లెక్కలు తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?

కాపలాదారు, అవినీతిపరుల మధ్య పోరాటం

కాపలాదారు, అవినీతిపరుల మధ్య పోరాటం

సార్వత్రిక ఎన్నికలను మోడీ కాపలాదారు, అవినీతిపరుల మధ్య పోరాటంగా అభివర్ణించారు. తనను వ్యతిరేకిస్తున్న వారంతా పాకిస్థాన్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారన్న మోడీ గుర్తు చేశారు. భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు సైన్యాన్ని అవమానిస్తున్నారని అన్నారు.

రాహుల్‌పై మోడీ సటైర్

రాహుల్‌పై మోడీ సటైర్

యాంటీ శాటిలైట్‌ ప్రయోగంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్ని మోడీ తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. మిషన్ శక్తి గురించి తాను చేసిన ప్రసంగాన్ని కొందరు నేతలు థియేటర్ సెట్‌తో పోల్చడం విడ్డూరంగా ఉందని అన్నారు. మిషన్ శక్తి ప్రయోగానికి, థియేటర్ సెట్‌కు తేడా తెలియని నేతలు ప్రతిపక్షంలో ఉన్నారని సటైర్ వేశారు.

English summary
Prime Minister Narendra Modi said the people of India had decided the mandate for 2019 and were ready to bring the BJP back to power. Addressing an election rally in Meerut, Modi said, “I will give you an account of what I did...and I will also get you an account of what others have done...you know I am your ‘chowkidar’ and I will do justice to you...there will be accountability and everyone will be made accountable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X