జయలలిత మేనకోడలు దీపాకు జై: రెండు రోజాపూలు గుర్తు
జయలలిత మేనకోడలు దీపా పేరవై ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఎంజీఆర్, జయలలిత, దీపా జయకుమార్ ఫోటో లు .
చెన్నై: తమిళనాడు రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం చాల కష్టం అంటున్నారు తమిళ సోదరులు. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో అన్నాడీఎంకే కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జయలలిత బెడ్ రూంలో శశికళ, ఏం చేస్తున్నారంటే ?
శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించి పెద్ద తప్పు చేశారని ఆపార్టీకి చెందిన కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా ఉన్న వారు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు జై కొడుతున్నారు. దీపా పేరవై ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.

దీపా జయకుమార్ కు మద్దతుగా జయలలిత, ఎంజీఆర్ ఫోటోలు పెట్టి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. జయలలిత నిజమైన వారసురాలు ఆమె మేనకోడలు దీపా అంటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు ఉన్న రెండు ఆకులకు బదులుగా రెండు రోజా పూలు పెట్టి ఇదే మా కొత్త పార్టీ అంటూ సంకేతాలు ఇస్తున్నారు.

తమిళనాడు సీఎం శశికళ ? లోక్ సభ డిప్యూటీ స్పీకర్
జయలలిత నమ్మిన వ్యక్తులే ఇప్పుడు శశికళకు దగ్గర అవుతున్నారని, అమ్మకు మోసం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు దీపా పేరవై ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చెయ్యడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రెండు గ్రూపులుగా చీలిపోయారు.












Click it and Unblock the Notifications