ఢిల్లీలో చర్చి ధ్వంసం, వేకువజామున మూడు గంటలకే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ చర్చి పైన కొందరు దాడికి పాల్పడ్డారు. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చర్చిని ధ్వంసం చేసినట్లుగా కనిపిస్తోంది.

గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని సెయింట్ అల్ఫోన్సా చర్చి అధికారులు చెప్పారు. వారు ఉదయం మూడు గంటల సమయంలో చర్చిలోకి ప్రవేశించారని, దాడికి పాల్పడ్డారని, గాజుపలక విగ్రహాన్ని కూడా పగులగొట్టారని చెప్పారు. నిందితులను గుర్తించవలసి ఉంది.

మతం పేరిట వివక్ష తగదు: భగవత్‌

Church in Delhi's Vasant Kunj area vandalized

భిన్నత్వాన్ని.. అంటే ఎవరు చేసే ఆరాధన, పాటించే సంప్రదాయాలు, వేషధారణ వంటి అంశాలను ఆయా వర్గాల వారు ఉత్సాహంగా, పండుగలా నిర్వహించుకోవాలని, అలాంటి వారిపై వివక్ష చూపడం ఎంతమాత్రమూ తగదని అని ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.

ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కల్చరల్‌ స్టడీస్‌ సంస్థ మైసూర్‌లో నిర్వహించిన 5వ అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనుషులంతా ఒక్కటేనని, పరస్పర సహాయసహకారాలతో జీవించాలని, అన్ని మతాల సారమూ ఇదేనని, దీన్ని అర్థం చేసుకొని ఉన్నత విలువలతో బతకాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+