బెంగాల్లోజడ్జీలనే బంధిస్తారా ? సీబీఐ/ఎన్ఏఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశాలు..!
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో ఈసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు ఊరట దక్కలేదు. అదే సమయంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు న్యాయాధికారుల్ని నియమించింది. ఇప్పుడు తాజాగా మాల్దాలో ఏడుగురు న్యాయాధికారుల్ని మమత సర్కార్ బంధించడంతో సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాల్దాలో ఏడుగురు న్యాయాధికారులను గంటల తరబడి బందీలుగా పట్టుకున్న దిగ్భ్రాంతికరమైన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇది తమ అధికారానికి సవాలు విసురుతోందని, పథకం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ ఆక్షేపించారు. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఏఐతో దర్యాప్తు జరిపించాలని భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామని కూడా తెలిపింది.

ఓటర్ల జాబితాల సవరణ సమయంలో ఇందులో నుంచి తమ పేర్లను తొలగించిన ఓటర్ల బృందం.. మాల్దాలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఏడుగురు న్యాయాధికారులను తొమ్మిది గంటలకు పైగా బందీలుగా పట్టుకుంది. నిన్న మధ్యాహ్నం నుంచి తెల్లవారుజామున సుమారు 1 గంట వరకూ బందీలుగా ఉన్న వీరు.. భారీ సంఖ్యలో పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది సాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలోనూ వాహనాలపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నం జరిగింది. పోలీసులు న్యాయాధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, పగిలిపోయిన కారు కిటికీ అద్దాలు, ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు కార్లపై రాళ్లు విసురుతున్న దృశ్యాలు కనిపించాయి.

Malda, Kaliachak, TMC mobs gheraoed 7 Judicial Officers. I am not at all surprised. Mamata is not giving up WB & BJP cannot play victim anymore
— Sameer (@BesuraTaansane) April 2, 2026
Malda has 70%+ peacefuls & Kaliachak has a violent record. ECI failed to deploy adequate central forcespic.twitter.com/v2Yr6UBwgp
సాయంత్రం 5 గంటలకు అధికారులను ముట్టడించారని, రాత్రి 11 గంటల వరకు వారికి సాయం అందలేదని సీజేఐ తెలిపారు. నిన్నటి ఘటనను రాజకీయ నాయకులందరూ ఏకగ్రీవంగా ఖండించాలని మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కోరారు. తాము ప్రత్యేక అధికారులను రక్షించడానికే ఇక్కడ ఉన్నామని, వారి ఆదేశాలు తమ కోర్టు ఆదేశాలుగా పరిగణించబడతాయని తెలిపారు. ఈసీ ఎక్కడి నుంచైనా బలగాలను రప్పించి, న్యాయాధికారులను కాపాడాలన్నారు. ఈ ఘటన న్యాయాధికారులను బెదిరించడానికే కాక, ఈ కోర్టు అధికారాన్ని కూడా సవాలు చేసే ఒక బరితెగించిన ప్రయత్నం అన్నారు. న్యాయాధికారులకు అప్పగించిన పని సురక్షితంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
-
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
టీ తోటల్లో ప్రధాని మోదీ- అట్నుంచి నరుక్కొస్తున్నారు మరి -
విజయ్ పై కక్షసాధింపు? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications