పోలీసులు బ్యూరోక్రాట్లపై సీజేఐ ఎన్వీ రమణ ఫైర్-దురాగతాలపై విచారణ చేయాలనుకున్నాం...

దేశవ్యాప్తంగా పోలీసులు, బ్యూరోక్రాట్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు రాష్ట్రాలు వారు సాగిస్తున్న దురాగతాలపై జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు కేసుల్లో పోలీసులు, బ్యూరోక్రాట్లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై స్పందించిన సీజేఐ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సస్పెండైన పోలీసు అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. రాజకీయ నేతలతో బ్యూరోక్రాట్లు, పోలీసుల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీరి దురాగతాలపై హైకోర్టు ఛీఫ్ జస్టిస్ లతో స్ధాయీ సంఘాల ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు భావించినట్లు జస్టిస్ రమణ వెల్లడించారు. దేశంలో పోలీసులు, బ్యూరోక్రాట్ల వ్యవహారశైలిపై తన వద్దకు చాలా ఫిర్యాదులు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలీసుల దురాగతాలపై ప్రస్తుతానికి స్ధాయీసంఘాలతో విచారణ చేయించే ఉద్దేశం లేదని రమణ వెల్లడించారు.

CJI Ramana Says Suprme Court once considered probing attrocities of bureaucrats and cops

ఛత్తీస్ ఘడ్ పోలీసు అకాడమీ డైరెక్టర్ గుర్జీందర్ పాల్ సింగ్ పై రాజద్రోహం, అవినీతి, మనుషుల అక్రమ రవాణా ఆరోపణలు మోపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేసింది. వీటిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రాజకీయ నేతలతో కుమ్మక్మై పోలీసులు చేపడుతున్న చర్యలను తప్పుబట్టారు. సింగ్ కేసులో విచారణ జరిపిన 8 వారాల్లో తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు సీజే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకొహ్లీ నేతృత్వంలోని మరో ధర్మాసనం ఆయన చట్టపరంగా ఈ కేసును ఎదుర్కోవడానికి తగిన అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడింది. ఆయనకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం సరికాదని పేర్కొంది.

గతంలోనూ సుప్రీంకోర్టు బెంచ్.. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు వ్యవహారాన్ని లేవనెత్తింది మరియు ప్రభుత్వాలు మారినప్పుడుప కోర్టులు అలాంటి అధికారులను క్రిమినల్ కేసుల్లో ఎందుకు రక్షించాలి అని అడిగారు. దీంతో ఐపీఎస్ సింగ్ తరఫు న్యాయవాది నిజాయితీపరులైన. నిజాయితీగా ఉన్న అధికారులు, అత్యుత్తమ సేవా రికార్డులు కలిగి ఉన్నవారిపై ప్రభుత్వం మూడు FIR లు దాఖలు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+