సీజేపీకి ముంబై స్థానికులు బిగ్ షాక్.. శివాజీ పార్క్ లో నిరసనలకు నో పర్మిషన్..

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌ లో భారీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీజేపీ నిర్ణయాన్ని శివాజీ పార్క్ లోని కొన్ని బృందాలు వ్యతిరేకించాయి. తక్షణమే ఈ పార్క్ ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శివాజీ పార్క్‌ లోని స్థానిక నివాసితులు సీజేపీ కార్యక్రమం నిర్వహించొద్దని తెలిపారు. దాంతో సీజేపీకి ముంబై స్థానికుల నుంచి షాక్ తగిలినట్లుగా భావించవచ్చు. అటు ముంబై పోలీసులు సైతం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. ఇక ఇదే అంశంపై మాట్లాడిన ముంబై బీజేపీ.. తాము స్థానికులకు మద్దతుగా ఉంటామని ఉంటామని ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మేరకు నిరసనల కోసం శివాజీ పార్క్ సందర్శించిన సీజేపీ టీమ్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై తాజాగా సీజేపీ స్పందిస్తూ.. వీళ్లంతా బీజేపీ వ్యక్తులే అని కీలక ఆరోపణలు చేసింది. ఈ మేరకు శివాజీ పార్క్ లోని స్థానికులతో ఓ సీజేపీ కార్యకర్త మాట్లాడుతూ.. వీరంతా స్థానిక నివాసితులేనా..? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పంపించారా..? అనే అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు సీజేపీ కార్యక్రమానికి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న ముంబైలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

CJP called for massive protests Shivaji Park Mumbai on October 2nd locals demanded leave the park

ఇక సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇండియా కూటమి నేతలు రేపు (సెప్టెంబర్‌ 30) దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాన్‌ స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగే ఈ కీలక సమావేశంలో జ్ఞానేశ్‌ కుమార్‌ ను పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంటులో మరోసారి అభిశంసన తీర్మానాన్ని తీసుకొచ్చే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+