సౌరవ్ దాస్, అషుతోష్ రాంకా రిలీజ్ అయ్యాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.. అభిజిత్ దిప్కే షాకింగ్ కామెంట్స్

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న తమ పార్టీ నేతలు సౌరవ్ దాస్, అషుతోష్ రాంకాలు రిలీజ్ అయ్యాక తదుపరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా అంశంపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. గత కొన్ని రోజులుగా తమపై అక్రమ అరెస్ట్ లు, నిర్భందాలు జరుగుతూనే ఉన్నాయని.. సీజేపీని అణచివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తాము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని.. ఇది సుదీర్ఘ యుద్ధం అని స్పష్టం చేశారు. ఈ యుద్ధం కోసం తాము ప్రిపేర్ గా ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ ఆదివారమే సౌరవ్ దాస్, అషుతోష్ రాంకాలు రిలీజ్ కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇక సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు దిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన శనివారం విడుదల అయ్యారు. అంతకుముందు దిల్లీలోని కొన్నాట్ ప్లేస్ లో నిర్వహించిన 'లెహ్రా హో తిరంగా' నిరసనలు తెలిపేందుకు దిప్కే వెళ్తుండగా ఆయన్ను పోలీసులు నిర్బంధించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అషుతోష్ రాంకాలు ఇంకా జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వాళ్లను బుధవారం ఐదు రోజుల జ్యూడిషియల్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై అభిజిత్ దిప్కే శనివారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. నా సోదరుల విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

CJP founder Abhijit Dipke said once the Sourav Das and Ashutosh Ranka released tell our next action

మరోవైపు సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అషుతోష్ రాంకాలను ఇవాళే విడుదల చేయాలని సీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. అక్టోబర్ 18 నాటికి వాళ్లు విడుదల కాకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే ఈ అంశంపై ఎలా ముందుకు సాగాలన్న దానిపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదించినట్లు సీజేపీ స్పష్టం చేసింది. ఏ నేరం చేయని తమ నేతలను అక్రమ నిర్బంధంలో ఉంచడాన్ని సీజేపీ పార్టీ తప్పుబట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+