భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వేల కోట్ల నష్టం దిశగా భారత్..

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ దీని వెనక ఉన్నట్లు గుర్తించిన భారత్.. పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

మే 7 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. ఈ క్రమంలో భారత్ విమానాలపై పాకిస్థాన్ గగనతల నిషేధాన్ని విధించింది. అప్పటి నుంచి ఆ నిషేధం అమల్లో ఉండగా తాజాగా మరోసారి ఆ గడువును పొడిగించింది. ఈ మేరకు భారత్ విమానాలకు పాకిస్థాన్ గగనతలం నిషేధాన్ని నవంబర్ 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

భారత్ రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ లు అలాగే భారతీయ ఎయిర్‌లైన్స్ ద్వారా నిర్వహించబడుతున్న లేదా లీజుకు తీసుకున్న పౌర విమానాలతో పాటు సైనిక విమానాలకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది. భారత్ విమానాలపై తొలిసారిగా పాకిస్థాన్ 2025, ఏప్రిల్ 23 న నిషేధం విధించింది. ఆ తర్వాత విడతల వారీగా ఆ గడువును పొడిగిస్తూ వస్తోంది.

Pakistan Another blow for Indian flights extends airspace ban on Indian aircraft till November 24

ఇక తాజాగా మరోసారి ఆ గడువును నవంబర్ 24 వరకు పొడిగిస్తూ సామాజిక మాధ్యమం అయిన ఎక్స్ లో అధికారికంగా పోస్టు చేసింది పాకిస్థాన్ ఎయిర్ లైన్స్. ఇక ఇదే విషయంపై పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఫ్రెష్ నోటీస్ టూ ఎయిర్ మెన్(NOTAM) ను జారీ చేసినట్లు పాకిస్థాన్ కు చెందిన జియో న్యూస్ వెల్లడించింది. గతంలోనూ భారత్ విమానాలపై పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ బ్యాన్ విధించింది. 1999 కార్గిల్ యూద్ధం, 2019 పుల్వామా దాడుల సమయంలోనూ భారత్ విమానాలపై పాకిస్థాన్ నిషేధం విధించినట్లు జియో న్యూస్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+