విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. వివరాలు ఇవే..!

హిట్స్- ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ఆయన ఇటీవల నటించిన సినిమా 'రణబాలి' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. విజయ్- రాహుల్ కాంబోలో గతంలో వచ్చిన టాక్సీవాలా మూవీ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో రణబాలి మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అలాగే ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్- రష్మిక వివాహం జరిగిన తర్వాత తొలిసారి చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దసరా కానుకగా భారీ అంచనాల మధ్య అక్టోబర్ 16న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. హిట్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది.

రణబాలి సినిమా కథ 1854 నుంచి 1878 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన చారిత్రక పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. 1876-78 రెండేళ్ల పాటు సాగిన 'మద్రాస్​ ఫెమైన్' నేపథ్యంలో ఈ కథ ముందుకెళ్తుంది. ఆనాటి కరవు పరిస్థితులు.. బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలు, ఆగడాలను కళ్లకు కట్టినట్టుగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరపై ఆవిష్కరించినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే జయమ్మ పాత్రలో రష్మిక కట్టిపడేసింది. ఇక ఈ మూవీలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో సర్​ థియోడర్ హెక్టర్​ అనే క్రూరమైన బ్రిటీష్ అధికారి పాత్రలో జీవించాడు. ఇక ఈ చిత్రానికి అజయ్- అతుల్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా టీ-సిరీస్​ సంస్థ సమర్పించింది.

Ranabaali movie collections Here are the worldwide 1day collections for Vijay Deverakonda Ranabaali

ఇక ఈ మూవీ బాక్సాఫీస్ విషయానికి వస్తే.. ఒక్క నైజాం ప్రాంతం నుంచే ఈ చిత్రానికి రూ. 3 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. అలాగే సీడెడ్ ప్రాంతం నుంచి రూ. 63 లక్షలు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఏపీ నుంచి రూ. 2 కోట్ల 22 లక్షల షేర్ వసూలు అయినట్లు సమాచారం. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి రణబాలి చిత్రానికి రూ. 6 కోట్ల 3 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా.. రూ. 10 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూల్లు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+