దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ వ్యాఖ్యలు .. మంత్రి సవిత ఫైర్

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"రప్పా... రప్పా నరకడం అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది వారేనన్నారు. తమ పార్టీ వారితో నామినేషన్లు వేయనివ్వడం లేదు అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా వారేనని మంత్రి సవిత ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ వ్యవహరిస్తున్నారు" అని మంత్రి సవిత మండిపడ్డారు.

Minister Savitha Slams Jagan Over Local Body Poll Violence Claims Alliance Will Sweep Elections

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ నాయకులు దాడులకు, అరాచకాలకు దిగారని ఆమె అన్నారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి నేతృత్వంలో పుంగనూరు, పులివెందుల, తిరుపతి, రాయచోటి వంటి ప్రాంతాల్లో దౌర్జన్యాలు జరిగాయని ఆరోపించారు. తమ క్యాడర్‌ను రెచ్చగొట్టి ప్రజలపైకి ఉసిగొల్పారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం, పోలీసులు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల పులివెందుల, కడపలో గతంలో ఎన్నడూ లేనంతగా నామినేషన్లు దాఖలయ్యాయని మంత్రి సవిత తెలిపారు.

జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ టీడీపీ సహా పలు పార్టీలు భారీగా నామినేషన్లు వేశాయన్నారు. గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలకు గుర్తుందని, కూటమి పార్టీలు అలాంటి పనులు చేయలేదని స్పష్టం చేశారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధికి పెద్దగా చేసింది లేదని, అందుకే ప్రజలకు ముఖం చూపే ధైర్యం లేక అరాచకాలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు.

దసరాకు ఏపీ వెళ్ళే వారి కోసం మరికొన్ని స్పెషల్ ట్రైన్స్.. దక్షిణమధ్య రైల్వే శుభవార్త!
దసరాకు ఏపీ వెళ్ళే వారి కోసం మరికొన్ని స్పెషల్ ట్రైన్స్.. దక్షిణమధ్య రైల్వే శుభవార్త!

స్థానిక సంస్థల్లో ఘోర ఓటమి ఖాయమని తెలిసి ఎన్నికలు జరగకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి సవిత చెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+