"సాధువులేం కాదు, వారికీ రాజకీయ వ్యూహాలు"- కాక్రోచ్ లపై తేల్చేసిన సోనమ్ వాంగ్ చుక్..!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యల తర్వాత పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఆన్ లైన్ నుంచి ఆఫ్ లైన్ కు మారిన తర్వాత జనంలో ఇంత ఆదరణ సాధించడం వెనుక ఉన్న కారణాల్లో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) కూడా ఒకరు. నీట్ అక్రమాలపై కాక్రోచ్ ల పోరాటం నచ్చి, వారికి అండగా నిలిచేందుకు కాశ్మీర్ నుంచి సోనమ్ ఢిల్లీ జంతర్ మంతర్ కు వచ్చి నిరాహారదీక్షకు దిగారు. ఏకంగా 20 రోజులకు పైగా నిరాహారదీక్ష చేసిన తర్వాత ఆయన్ను ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. ఆ తర్వాతే కాక్రోచ్ ఉద్యమం మరింత తీవ్రమై పార్లమెంట్ మార్చ్ జరిగింది. ఇవన్నీ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమయ్యాయి.

సీజేఐ-బార్ కౌన్సిల్ పై విద్యార్ధుల ఆగ్రహం ఫలితం-నేషనల్ లా స్కూల్ కీలక నిర్ణయం..!
సీజేఐ-బార్ కౌన్సిల్ పై విద్యార్ధుల ఆగ్రహం ఫలితం-నేషనల్ లా స్కూల్ కీలక నిర్ణయం..!

అయితే జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత ఏం చేయాలనే దానిపై ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన ఆ పార్టీ వ్యవస్థాపకులు జాతీయ స్ధాయిలో టీమ్ ఏర్పాటుతో పాటు స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై ఉద్యమాన్ని ప్రకటించారు. దీని ఫలితంగా ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం కూడా దిగివచ్చింది. అయితే రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చేసిన కాక్రోచ్ లు.. ఒత్తిడి గ్రూపుగానే కొనసాగుతామని తేల్చేచెప్పేసారు. అయితే వారికి గతంలో మద్దతుఇచ్చిన సోనమ్ వాంగ్ చుక్ మాత్రం వారికి రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయంటూ బాంబుపేల్చారు.

CJP Founders Have Political Ambitions Nothing Wrong With That Sonam Wangchuk
Cockroach Janta Party: ఢిల్లీలో మరో ర్యాలీ..! కాక్రోచ్ పార్టీ సంచలన నిర్ణయం..!
Cockroach Janta Party: ఢిల్లీలో మరో ర్యాలీ..! కాక్రోచ్ పార్టీ సంచలన నిర్ణయం..!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారిని గమనించిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులకు రాజకీయ ఆశయాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లోకి రావాలని ఆశించడంలో తప్పులేదని ఆయన తెలిపారు. యువత ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలలో చేరడాన్ని లేదా సొంత పార్టీలను స్థాపించడాన్ని తాను ప్రోత్సహిస్తానని అన్నారు.సీజేపీ వ్యవస్థాపకులను రాజకీయ ఆశయాలు లేని ఋషులుగా తాను భావించడం లేదని వాంగ్‌చుక్ చెప్పారు. వారు ఆ విషయాన్ని తనకు ఎప్పుడూ నేరుగా చెప్పనప్పటికీ, వారికి రాజకీయ ఆశయాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+