పోలీసులకు కాక్రోచ్ ల అనూహ్య ఝలక్..! దిప్కే స్ధానంలో కొత్త బాస్..!
సీఈసీ రాజీనామా కోరుతూ ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు ఇవాళ గట్టి షాక్ తగిలింది. కాక్రోచ్ పార్టీలో కీలక నేతలైన అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్టు చేస్తే చాలు ఢిల్లీ నిరసనల్ని అడ్డుకోవచ్చని భావించిన పోలీసులకు సీజేపీ షాకిచ్చింది. కీలక నేతల అరెస్టుల్ని ముందే ఊహించిన కాక్రోచ్ బాస్ అభిజీత్ దిప్కే(Abhijeet Dipke).. తనను నిర్బందంలోకి తీసుకోకముందే ఓ వీడియోను రికార్డు చేశారు. అందులో కొత్త బాస్ పేరును కూడా వెల్లడించారు.
కాక్రోచ్ జనతా పార్టీ సీఈసీ రాజీనామా కోసం ముంబైలో మొదలుపెట్టిన ఆందోళనలకు కేంద్రం తలొగ్గకపోవడంతో దాన్ని కాస్తా ఢిల్లీకి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచీ ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు, మోహరింపులు, అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో అడుగుపెట్టగానే తమను అరెస్టు చేస్తామని కాక్రోచ్ బాస్ అభిజీత్ దిప్కేతో పాటు ఆయన సహచరులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఊహించారు. దీంతో చాలా సాధారణ రీతిలో తమను అరెస్టు చేసుకోండంటూ ఇవాళ ఉదయం విమానంలో తనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన మహిళా పోలీసులతో దిప్కే చెప్పేశారు. అప్పుడే డౌట్లు మొదలయ్యాయి.

IMPORTANT Until Abhijeet Dipke, Saurav Das and Ashutosh Ranka are in detention, CJP’s Organization In-Charge Ajinkya Shinde will lead this protest at Jantar Mantar. Abhijeet had pre-recorded this video last night in anticipation of a potential arrest. @AjinkyaCJP https://t.co/WSQ69mKfTV
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026
అనంతరం దిప్కే, రాంకా, సౌరవ్ దాస్ లను పోలీసులు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. దీంతో నిరసనలకు అడ్డుకట్ట పడినట్లేనని ఢిల్లీ పోలీసులు భావించారు. కానీ గంటల వ్యవధిలోనే కాక్రోచ్ జనతా పార్టీ అంతకు ముందే తమ బాస్ అభిజీత్ దిప్కే రికార్డు చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇందులో ఆయన.. తమ పార్టీ కీలక నేతల్ని అరెస్టు చేస్తారని ముందే తెలుసని, అందుకే ఇవాళ్టి ఢిల్లీ నిరసనల్ని తమ పార్టీలో మరో నేత ఆజింక్యా షిండే (Ajinkya Shinde) నడిపిస్తారని బాంబు పేల్చారు. దీంతో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు పరుగులు తీస్తున్నారు. అలాగే దిప్కే రిలీజ్ చేసిన ఈ వీడియో ఎక్కడి నుంచి అప్ లోడ్ చేస్తున్నారో ఆరా తీస్తున్నారు.














Click it and Unblock the Notifications
