• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీచర్‌కు స్టూడెంట్ 'సెక్స్' ప్రపోజల్: దారి తప్పుతున్న విద్యార్థులు..

|

గుర్గావ్: ఏడో తరగతి చదివే ఒక విద్యార్థి టీచర్‌నే రేప్ చేస్తానని బెదిరించాడు. ఆమెనే కాదు, ఆమె కుమార్తెను కూడా రేప్ చేస్తానని హెచ్చరించాడు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో అతను పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. సదరు టీచర్ కుమార్తె, బెదిరింపులకు పాల్పడ్డ ఆ విద్యార్థి ఇద్దరూ ఒకే క్లాస్ కావడం గమనార్హం.

ఇక మరో సంఘటనలో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి తమ టీచర్ ను క్యాండిల్ లైట్ డిన్నర్ కు ఆహ్వానిస్తూ లేఖ రాశాడు. అక్కడితో ఆగకుండా.. 'సెక్స్' ప్రపోజల్ కూడా చేశాడు. టీచర్ల గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కావడంతో వారి పేర్లు గానీ, స్కూల్ పేర్లు గానీ బయటకు వెల్లడించడం లేదు.

స్కూల్ స్టేట్‌మెంట్:

స్కూల్ స్టేట్‌మెంట్:

'ఒక ఏడో తరగతి విద్యార్థి టీచర్ పట్ల ఇలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైన కౌన్సెలింగ్ ఇప్పించడంతో పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తాం. ఇలాంటి విషయాలను యాజమాన్యం ఎంత మాత్రం సహించదు' అని సదరు స్కూల్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

సుమోటో కేసు:

సుమోటో కేసు:

టీచర్లపై విద్యార్థుల అసభ్య ప్రవర్తనను సుమోటో కేసుగా తీసుకుంటున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ శకుంతల దల్ అన్నారు. స్కూల్ విద్యార్థులకు ఒక నోటీసు కూడా పంపించామని తెలిపారు. ఈ రెండు ఘటనలపై వారిని విచారిస్తామని, అలాగే విద్యార్థులతో పాటు టీచర్లకూ కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహిస్తామని చెప్పారు.

ప్రిన్సిపాల్స్ స్టేట్‌మెంట్:

ప్రిన్సిపాల్స్ స్టేట్‌మెంట్:

ఇదీ ఒక్క స్కూల్లో జరిగిన సంఘటన మాత్రమే కాదని, ఈరోజుల్లో చాలామంది విద్యార్థులు ఇలాగే తయారవుతున్నారని, తల్లిదండ్రులు వారిని కనిపెట్టాల్సిన బాధ్యత ఉందని పలువురు స్కూల్ ప్రిన్సిపాల్స్ అభిప్రాయపడ్డారు. చాలామంది విద్యార్థులు చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్స్, గాడ్జెట్స్ వాడుతున్నారని, వాళ్లు ఎలాంటి సైట్స్ లోకి వెళ్తున్నారనే దానిపై పర్యవేక్షణ కొరవడిందని హెచ్‌డి‌ఎఫ్‌సి స్కూల్ ప్రిన్సిపాల్ అభిప్రాయపడ్డారు.

సైకాలజిస్ట్ శ్వేతా వర్మ:

సైకాలజిస్ట్ శ్వేతా వర్మ:

'హైస్కూల్ విద్యార్థులకు మంచి చెడ్డలు బోధించడంలో టీచర్స్ మంచి పాత్రనే పోషిస్తున్నారు. అయితే చిన్నపిల్లలతో ఎలా వ్యవహరించాలో వారికి కూడా అర్థం కావడం లేదు. నగరంలోని చాలా స్కూళ్లలో సరైన కౌన్సిలర్లు లేరు. ఈరోజుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే ఒక భిన్నమైన అప్రోచ్ అవసరం.

టీచర్లు పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చెబితే సరిపోదు.. అంతకుమించి వాళ్లు చిన్నారుల మైండ్ సెట్ స్టడీ చేయాలి' అని శ్వేతా శర్మ అనే కొలంబియా ఆసియా హాస్పిటల్ సైకాలజిస్ట్ అభిప్రాయపడ్డారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Class VII student of a well-known Gurugram school threatened to rape his teacher and her daughter in an online post. The daughter studies with him in the same class. In another incident, a Class VIII student of the same school sent a mail to a teacher, asking her out for a candlelight date and sex.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more