బిగ్ బ్రేకింగ్: ప్రధాని నరేంద్ర మోడీకి గుజరాత్ అల్లర్లలో క్లీన్ చిట్
2002 గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ తన తుది నివేదికను గుజరాత్ అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది.
ఈ నివేదికను ఆ రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హ్ జడేజా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి 2008లో జస్టిస్ నానావతి-మెహతా కమిషన్ తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తొలి నివేదికలో గోద్రా ఘటనలో రైలు కాలిపోయిన ఘటనను ప్రస్తావించింది.సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి ఎస్-6 కోచ్ అల్లర్ల సందర్భంగా గోద్రా రైల్వే స్టేషన్‌లో తగలబెట్టారు.

అయితే ఇది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన కుట్ర అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. 2008లో తొలి నివేదికలో కూడా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి -మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ఇచ్చిన ఐదేళ్లకు అసెంబ్లీలో గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా ప్రవేశపెట్టారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి 2014లో గుజరాత్ ప్రభుత్వానికి రిటైర్డ్ జస్టిస్ నానావతి అక్షయ్ మెహతాలు తమ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ అల్లర్లలో దాదాపు 1000 మంది ప్రజలు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అత్యధికులు మైనార్టీ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఈ రిపోర్టును అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందిబెన్ పటేల్‌కు సమర్పించారు.
గుజరాత్ అల్లర్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. గుజరాత్ అల్లర్ల సందర్భంగా చెలరేగిన గొడవల కారణంగా గోద్రా రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బోగిలో ఉన్న 59 మంది కరసేవకులు మృతి చెందారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications