బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CM house: ఎంత ధైర్యం ?, ఏకంగా సీఎం ఇంట్లోకి ఎంట్రీ, సీఎంతో మీటింగ్ అని చెప్పి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇంటి దగ్గర, ఆయన దినచర్యలు నిర్వహించే అధికారిక నివాసం దగ్గర పోలీసులు ఎంత గట్టిబందోబస్తు నిర్వహిస్తారో కొత్తగా చెప్పనవసరం లేదు. అలాంటి సీఎం అధికారిక నివాసం దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లి తాను బీబీఎంపీ ఇంజనీరు అంటూ అక్కడి పోలీసు అధికారులను పరిచయం చేసుకున్నారు. బీబీఎంపీ చీఫ్ ఇంజనీరు దగ్గర నేను పీఏగా పని చేస్తున్నానని, సీఎం నివాసంలో జరుగుతున్న ఉన్నత స్థాయి మీటింగ్ కు హాజరుకావడానికి వచ్చానని చెప్పాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న ఐడీ కార్డు చూసి అతన్ని లోపలికి పంపించారు. సీఎం నివాసం ఆవరణంలో నడుచుకుంటూ వెలుతున్న సమయంలో పోలీసులకు ఎక్కడో డౌట్ వచ్చి ఆ యువకుడిని అడ్డుకుని ఆరా తీసి షాక్ అయ్యారు.

Girlfriend: ప్రియురాలు ఎర్రగా, బుర్రగా ఉందని ఆంటీతో డీల్ మాట్లాడి ఏం చేశాడంటే ?, 10 మందితో !Girlfriend: ప్రియురాలు ఎర్రగా, బుర్రగా ఉందని ఆంటీతో డీల్ మాట్లాడి ఏం చేశాడంటే ?, 10 మందితో !

 సీఎం ఇంటి దగ్గరకు నేరుగా వెళ్లాడు

సీఎం ఇంటి దగ్గరకు నేరుగా వెళ్లాడు

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నివాసం ఉంటున్న ఇంటి దగ్గర, బెంగళూరులోని సదానంద సర్కిల్ సమీపంలోని చిత్రకళా పరిషత్ సమీపంలోని సీఎం అధికారిక నివాసం కృష్ణా దగ్గర బెంగళూరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న పరమేశ్వర్ (30) అనే యువకుడు సీఎం బసవరాజ్ బోమ్మయ్ అధికారిక నివాసం కృష్ణా దగ్గరకు వెళ్లాడు.

 బీబీఎంపీ ఇంజనీర్ అని పరిచయం

బీబీఎంపీ ఇంజనీర్ అని పరిచయం

కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అధికారిక నివాసం కృష్ణా దగ్గరకు వెళ్లిన పరమేశ్వరన్ తాను బీబీఎంపీ ఇంజనీరు అంటూ అక్కడి పోలీసు అధికారులను పరిచయం చేసుకున్నారు. బీబీఎంపీ చీఫ్ ఇంజనీరు దగ్గర నేను పీఏగా పని చేస్తున్నానని, సీఎం బసవరాజ్ బోమ్మయ్ నివాసంలో జరుగుతున్న ఉన్నత స్థాయి మీటింగ్ కు హాజరుకావడానికి వచ్చానని పరమేశ్వర్ అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసు అధికారులకు చెప్పాడు.

 ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్

ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్

పోలీసులు పరమేశ్వర్ దగ్గర ఉన్న ఐడీ కార్డు చూశారు. బీబీఎంపీ సింబర్ లో ఐడీ కార్డు ఉండటంతో పరమేశ్వర్ ను సీఎం అధికారిక నివాసం లోపలికి పంపించారు. సీఎం అధికారిక నివాసం ఆవరణంలో నడుచుకుంటూ వెలుతున్న సమయంలో పోలీసులకు అనుమానం వచ్చి పరమేశ్వర్ ను అడ్డుకుని అతని డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు.

 పక్కా 420 అని తెలిసిపోయింది

పక్కా 420 అని తెలిసిపోయింది

పరమేశ్వర్ దగ్గర ఉన్న ఐడీ కార్డులో ఒక ఇంటి అడ్రెస్, అతని డ్రైవింగ్ లైసెన్స్ లో మరో అడ్రస్ ఉండటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీబీఎంపీ ఆఫీసుకు, సీఎం అధికార నివాసంలో ఉన్న అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. పరమేశ్వర్ అనే వ్యక్తి ఎవరో తెలీదని బీబీఎంపీ అధికారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

 నిరుద్యోగులకు పంగనామాలు

నిరుద్యోగులకు పంగనామాలు

పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తున్న పరమేశ్వర్ సీఎం ఇంట్లో తనకు అందరూ తెలుసుని నమ్మించి మోసం చేస్తున్నాడని, నిరుద్యోగుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్నాడని పోలీసులు అన్నారు. పరమేశ్వర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని హైగ్రౌండ్స్ పోలీసు అధికారులు తెలిపారు.

English summary
CM house: Accused arrested for who enter Karnataka CM home office in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X