చెన్నైమెట్రో ప్రత్యేకతలెన్నో, రైల్ డ్రైవర్ మహిళ(పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం నాడు మధ్యాహ్నం చెన్నైలో మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె తొలి కొత్త మెట్రో సర్వీసును ప్రారంభించారు. నాలుగు బోగీలు ఉండే మెట్రో రైలులో 1276 మంది ప్రయాణించగలరు.
మెట్రో రైలు కేవలం 18 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, జైపూర్ నగరాల్లో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. చెన్నైలో పనులు ప్రారంభమైన నాలుగేళ్లకే సర్వీసుల ప్రారంభం కావడం గమనార్హం.
మెట్రో రైలు
చెన్నై ప్రజలు ఎన్నో రోజులుగా మెట్రో రైలు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దానిని జయలలిత మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

మెట్రో రైలు
తొలి సర్వీసును అలందూర్ నుంచి కోయంబేడుకు నడిపారు. పది కిలోమీటర్ల దూరాన్ని ఈ మెట్రో రైలు 18 నిమిషాల్లో చేరుకుంది.

మెట్రో రైలు
ఈ ప్రయాణంలో రైలు మొత్తం 7 స్టేషన్‌లలో ఆగిందని అధికారులు చెప్పారు. ఈ రైలులో నాలుగు బోగీలు ఉన్నాయి.

మెట్రో రైలు
డీఎంకే ప్రభుత్వం హయాంలో అనుమతి పొందిన మెట్రో వాస్తవానికి గత అక్టోబర్ నెలలోనే ప్రారంభం కావలసి ఉంది. పలుమార్లు వాయిదా పడి ఈ రోజు ప్రారంభమైంది.

మెట్రో రైలు
మెట్రో సేవలు పొందుతున్న ఆరో నగరం చెన్నై. కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, జైపూర్ నగరాల్లో ఇప్పటికే మెట్రో సేవలు అందుతున్నాయి.

మెట్రో రైలు
చెన్నై మెట్రో రైళ్లుకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని మ్యానువల్‌గా, ఆటోమేటిక్‌గా నడిచేలా రూపొందించారు.

మెట్రో రైలు
ఆటోమేటిక్‌గా నడపడం ఇప్పటి వరకు మన వద్ద లేదు. దీంతో కొద్ది రోజులు మ్యానువల్‌గా నడపనున్నారు. రైలు నడిచేటప్పుడు డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థుడైతే, రైలు దానంతట అదే ఆగిపోతుంది.

మెట్రో రైలు
దాంతో ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం ఉండదు. ప్రయాణీకుల రద్దీకి అనుగణంగా మెట్రో రైలు టైం టేబుల్ నిర్ధారిస్తామని, కచ్చితమైన సమయాలు పాటిస్తామని అధికారులు చెప్పారు.

మెట్రో రైలు
కాగా, జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మెట్రో రైలును నడిపింది మహిళ కావడం గమనార్హం.

మెట్రో రైలు
మెట్రో రైలు చెన్నైలోను అలందూర్ నుంచి కోయంబేడు వరకు పరుగు పెట్టింది. దీనిని నడిపింది 28 ఏళ్ల ప్రీతి. ఇంజినీరింగ్ డిప్లోమా పూర్తి చేసింది.

మెట్రో రైలు
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారిలో ఎంపికైన తొలి మహిళ తానేనంటూ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ఘనతను సాధించడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వయ్క్తం చేశారు.

మెట్రో రైలు
తమ కుమార్తె కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని మెట్రో రైలు నడిపిన 28 ఏళ్ల ప్రీతి తల్లిదండ్రులు పొంగిపోతున్నారు.












Click it and Unblock the Notifications