పోస్టర్ కలకలం : దుర్గా మాతగా మమతా - మహిషాసురుడిగా మోదీ, అమిత్ షా !! : రగిలిపోతున్న బీజేపీ నేతలు
పశ్చిమబెంగాల్‌లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి పోస్టర్ కలకలం రేపుతోంది. ఈ పోస్టర్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దుర్గా మాతగా.. ప్రధాని మోదీని, మహిషాసురుడిగా చూపుతూ వెలిసిన వెలిసింది. ఈ పోస్టర్ వ్యవహారం ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రి అమిత్ షాను అవమానించేలా ఉందంటూ కాషాయ దళం భగ్గుమంటుంది.
దుర్గమ్మగా దీదీ.. మహిషాసురుడిగా మోదీ, అమిత్ షా..
పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మిడ్నపూర్‌లోని ఓ వార్డు నుంచి బరిలో నిలిచిన టీఎంసీ నేత అనిమ సాహ అనుచరులు ఈ పోస్టర్ ఏర్పాటు చేశారు. దీనిలో సీఎం దీదీని దుర్గమాతగా చూపారు. ప్రధాని మోదీని, కేంద్ర హోమంత్రి అమిత్ షాను మహిషాసురుడిగా పోల్చారు. అటు విపక్ష పార్టీలను గొర్రెలు అంటూ చూపించారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే వాటిని బలిపశువును చేసినట్లేనని పోస్టర్‌లో చిత్రీకరిస్తూ రాసుకొచ్చారు. దీంతో ఇది వివాదాలకు దారితీసింది.

పోస్టర్‌పై భగ్గుమంటున్న బీజేపీ
ఈ పోస్టర్ వ్యవహారంపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య తీవ్రంగా స్పందించారు. నేతలను దేవతలుగా చూపడం సనాతన ధర్మాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాక్షసులుగా చూపడం వారిని అవమానించడమేనని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన పనులకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Recommended Video

టీఎంసీ నేత రియాక్షన్..
కాగా, ఈ పోస్టర్ వ్యవహారం తనుకు తెలియదని టీఎంసీ నేత అనిమ సాహా తెలిపారు. తనకు ముందే తెలిసి ఉంటే ఇలాంటి పోస్టర్‌లకు అనుమతించేవాడిని కాదని చెప్పుకొచ్చారు. దీనిని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల హోరా హోరిగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 27న మొత్తం 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్‌పై వివాదం నెలకొంది.












Click it and Unblock the Notifications