లాలూకు మమత పాద నమస్కారం- కీలక భేటీకి ముందు అనూహ్యం

పాట్నా: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- దీని దూకుడును నిలువరించడానికి యూపీఏ సమాయాత్తమౌతోన్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతోన్నాయి. బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం సమావేశం కాబోతోన్నాయి. పాట్నాలోని సర్క్యుట్ హౌస్ దీనికి వేదికగా మారింది.

జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ భేటీకి సారథ్యాన్ని వహించనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ.. వంటి 19 ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీలో పాల్గొనున్నాయి. తటస్థ వైఖరిని అనుసరిస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్.. దీనికి దూరంగా ఉంటోన్నాయి. భారత్ రాష్ట్ర సమితి కూడా పాల్గొనే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే.

Mamata Banerjee touches Lalu Prasad Yadav feet

ఈ భేటీలో పాల్గొనడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.. ఈ సాయంత్రం పాట్నాకు చేరుకున్నారు. నేరుగా సర్క్యుట్ హౌస్‌కు వెళ్లారు. కొద్దిసేపటి తరువాత నితీష్ కుమార్ కూడా సర్క్యుట్ హౌస్‌కు వెళ్లారు. మమత బెనర్జీని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌నను కలుసుకున్నారు మమత. ఆయనకు పాదనమస్కారం చేశారు. ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, రబ్రీ దేవీలతో కొద్దిసేపు ముచ్చటించారు. లాలూ యాదవ్ అంటే తనకు ఎంతగానో గౌరవం ఉందని, కేంద్ర ప్రభుత్వం అకారణంగా ఆయనను జైలుకు పంపిందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ దాడులతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శించారు. లాలూతో తనకు ఉన్న అనుబంధాన్ని మమత బెనర్జీ గుర్తు చేసుకున్నారు. తామిద్దరం ఒకే సమయంలో ఎంపీలుగా ఉన్నామని, కీలకమైన రైల్వేశాఖకు నిర్వహించామని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+