కంటతడి పెట్టుకున్న కశ్మీర్ సీఎం..

Subscribe to Oneindia Telugu

కశ్మీర్ : జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ కంటతడి పెట్టుకున్నారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. కశ్మీర్ లో చోటు చేసుకున్న అల్లర్లు.. అక్కడి ప్రజలను ఎంతగా కకావికలం చేశాయో ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు.

CM Mehbooba Mufti calls for all-party meeting; NC stays away

అనంతనాగ్ జిల్లా పర్యటన సందర్బంగా.. కశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన మెహబూబా.. కశ్మీర్ పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో చిన్నారులతో సహా చాలామంది కంటి చూపు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ముఫ్తీ.

కశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాల‌ని ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 43 మంది మరణించగా, దాదాపుగా 3వేల మంది గాయాలపాయిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An all-party meeting was convened by Jammu and Kashmir Chief Minister Mehbooba Mufti and it was held on Thursday to review the situation in the violence-hit Valley and find a way out of the unrest that has left 43 persons dead and 3400 others injured.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి