సీఎం నితీష్ కుమార్ రాజీనామా: మహా కూటమి చెల్లాచెదురు
Nitish Kumar: బిహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జనతాళ్ (యునైటెడ్) నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది.
జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించారు. కొద్దిసేపటి కిందటే ఆయన పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా ఘట్‌బంధన్ కూటమిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని వివరించారు. అందులో నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో రాజీనామా చేయదలిచినట్లు తెలిపారు. అనంతరం ఆయనకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
ఈ ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభా పక్షం సమావేశమైంది. పాట్నాలోని నితీష్ కుమార్ అధికారిక నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. జేడీయూకు ఉన్న మొత్తం 45 మంది శాసన సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తుది నిర్ణయాన్ని తీసుకునే హక్కును నితీష్ కుమార్‌పైనే వదిలేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతుంది.
జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications