తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా శశికళ, పన్నీరు సెల్వం రాజీనామా
అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమెను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆమెనే కానున్నారు.
ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్‌లో వార్త వచ్చింది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. శశికళను శాసన సభా పక్ష నాయకురాలిగా ప్రతిపాదించారని పేర్కొంది. శశికళను ఎన్నుకోవడంతో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఈ భేటీలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలుతదితరులు పాల్గొన్నారు. శశికళను ముఖ్యమంత్రిగా చేయాలని పలువురు నినాదాలు చేశారు. మరోవర్గం సీఎం పన్నీరుసెల్వంకు అండగా ఉంది. పార్టీ కార్యాలయం మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది.












Click it and Unblock the Notifications