జయలలిత మృతి, జ్యుడీషియల్ విచారణ, వీడియోలు ఇస్తాం, మన్నార్ గుడి ఫ్యామిలీ, పన్నీర్ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని శశికళ నటరాజన్ సోదరుడు దివాకరన్ కుమారుడు జయంత్ అన్నాడు. అమ్మ మరణంలో ఎలాంటి అనుమానాలు వద్దని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకు చెప్పాడు.
జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఆదేశిస్తే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం విచారణ ఎదుర్కోవలసి వస్తుందని జయంత్ అన్నాడు. అందుకు పన్నీర్ సెల్వం సిద్దంగా ఉన్నారా ? అంటూ జయంత్ ప్రశ్నించారు.

జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే సరైన సాక్షాదారాలు ఇవ్వడానికి శశికళ కుటుంబ సభ్యులు సిద్దంగా ఉన్నారని జయంత్ చెప్పాడు. జయలలితకు చికిత్స చేసే సమయంలో వందకు వంద శాతం వీడియోలు తీశామని జయంత్ వివరించాడు.
జ్యుడీషియల్ విచారణ జరిగితే మా దగ్గర ఉన్న వీడియోలు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని జయంత్ అన్నాడు. మదురై జిల్లాలో జరిగిన టీటీవీ దినకరన్ బహిరంగ సభ విజయవంతం కావడంతో శశికళ కుటుంబ సభ్యులు ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. అన్నాడీఎంకే పార్టీకి మేమే నిజమైన వారసులు అంటు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు.












Click it and Unblock the Notifications