సోనియా గాంధీతో మాట్లాడిన తరువాత డిసైడ్ చేస్తా, రూట్ మార్చిన డీకే శివకుమార్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజారిటీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు ? అనే టెన్షన్ పట్టుకుంది. కొట్టమంటే పాముకు కోపం, వదలమంటే కర్రకు కోపం అనే సామెతలా కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితి ఎదురైయ్యింది.

ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన సిద్దరామయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెందిన నాయకులు అందరితో చర్చలు జరిపారు. కర్ణాటక సీఎం కుర్చీలో సిద్దరామయ్యను ఉంటే బాగుంటుంది అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు చెందిన చాలా మంది నాయకులు బావిస్తున్నారని తెలిసింది.

DK Sivakumar says he will tell the truth after talking to Sonia Gandhi.

బెంగళూరులోనే మకాం వేసిన డీకే శివకుమార్ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఢిల్లీలో ఉన్న తమ్ముడు డీకే, సురేష్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.

సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని రాహుల్ గాంధీ కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకున్న డీకే శివకుమార్ షాక్ అయ్యారని, అందుకే ఆయన ఢిల్లీ వెళ్లకుండా బెంగళూరులోనే ఉండిపోయారని తెలిసింది. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సిమ్లాలో ఉన్నారు. మంగళవారం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ చేరుకుంటున్నారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ తాను సోమవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, అయితే అనారోగ్యంతో తాను ఢిల్లీ వెళ్లలేకపోయానని, ఇప్పుడు తన ఆరోగ్యం కుదటపడిందని, మంగళవారం తాను ఢిల్లీ వెలుతానని డీకే శివకుమార్ అన్నారు. తాను ఢిల్లీ వెళ్లిన తరువాత మొదట సోనియా గాంధీని కలిసి చర్చిస్తానని, తరువాత వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తనకు తెలీదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ తాను ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో చర్చలు జరిపానని, మంగళవారం డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరుపుతారని, మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్ చర్చించి అసలు మ్యాటర్ మీడియాకు చెబుతారని డీకే. సురేష్ అన్నారు. మొత్తం మీద బాల్ ఢిల్లీలో ఉండటంతో అందరికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులకు టెన్షన్ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+