వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోరాడ్తాం: చిరు, రమేష్ సారీ: పురంధేశ్వరి రిజైన్‌కు ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) విషయంలో తాము పోరాడుతామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బుధవారం చెప్పారు. రాజ్యసభలో తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. లోకసభలో బిల్లును ప్రవేశ పెట్టిన తీరు సరిగా లేదన్నారు.

కిరణ్ రాజీనామా దురదృష్టకరం

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆయన రాజీనామా చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి పళ్లం రాజు అన్నారు. చాలా క్లిష్ట పరిణామాలను కిరణ్ అధిగమించారన్నారు.

CM Ramesh sorry for Rajya Sabha issue

సిఎం రమేష్ క్షమాపణ

రాజ్యసభలో జరిగిన ఘటనపై సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపి సిఎం రమేష్ క్షమాపణ చెప్పారు. ఉదయం రాజ్యసభ సెక్రటరీ జనరల్ చేతిలోని పత్రాలను లాక్కునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. రెండుగంటలకు సభ ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంపీ తీరును తప్పుపట్టారు. సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. దీంతో తాను ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని రమేష్ అన్నారు. సిఎం రమేష్ క్షమాపణలు చెప్పడంతో చర్యల్లేవని కురియన్ ప్రకటించారు.

రాజ్యసభలో గందరగోళం

రాజ్యసభ రెండు గంటలకు ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగుతోంది. కేంద్రమంత్రులు వెల్లోకి వచ్చి ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమని బిజెపి నేత అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. తాము తెలంగాణకు అనుకూలమని, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు, జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వెల్లోకి చొచ్చుకెళ్లారు. కెవిపి రామచంద్ర రావు ప్లకార్డుతో నిరసన తెలిపారు.

టిడిపి సభ్యులను షటప్ అన్న కురియన్

టిడిపి ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తుండటంతో కురియన్ వారిని నోర్ముసుకోవాలని (షటప్) అని వారించారు. మరోవైపు కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి, ఎంపీలు సుబ్బిరామి రెడ్డి తదితరులు నిరసన తెలిపారు. సభలో గందరగోళం ఏర్పడటంతో మూడు గంటలకు వాయిదా వేశారు.

సుప్రీం కోర్టుకు మేకపాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

పురంధేశ్వరి రాజీనామా ఆమోదం

కేంద్రమంత్రి పదవికి రాజీనామాచేసిన దగ్గుబాటి పురంధేశ్వరి రాజీనామాను ఆమోదించారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాలను కూడాస్పీకర్ ఆమోదించారు.

English summary
Seemandhra Telugudesam Rajya Sabha Member CM Ramesh says sorry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X