మైండ్ బ్లాక్, సిద్దూ దెబ్బతో అన్ని పదవులు ఊస్ట్, పైసా కూడా విడుదల చెయ్యకూడదు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంతకాలం బీజేపీ మీద 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేసి ఆ పార్టీని ఇంటికి పంపించేశారు. బీజేపీ అవినీతి ప్రభుత్వం, 40 శాతం కమీషన్ తీసుకోకుండా ఏపని చెయ్యదు అంటూ సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.
135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఎవ్వరి మద్దతు లేకుండా దర్జాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని అన్ని కార్పోరేషన్ల అధ్యక్ష పదవులు, డైరెక్టర్ పదవులు, కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ బోర్డు అధ్యక్ష పదవులు, డైరెక్టర పదవులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కార్పోరేషన్ల, బోర్డులతో పాటు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల్లోని నామినేటెడ్ పదవులు అన్ని రద్దు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మా తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన ఆదేశాల్లో ఏం చెప్పారు అనే ప్రకటన కూడా విడుదల అయ్యింది.
ఇంతకాలం కర్ణాటకలో ఉన్న కార్పోరేషన్లు, బోర్డుల అధ్యక్ష పదవులు, డైరెక్టర్లు, సభ్యలు పదవులు అన్ని రద్దు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు సోమవారం రోజు నుంచి అన్ని కార్పోరేషన్లు. బోర్డుల అధ్యక్ష పదవులు, డైరెక్టర్ల పదవులు రద్దు అవుతున్నాయని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఇక ముందు కార్పోరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలకు కొత్త అధ్యక్షులు, డైరెక్టర్ల నియాకం జరిగే వరకు ఆర్థిక లావాదేవీలు జరగకూడదని, ఎలాంటి నిధులు మంజూరు చెయ్యకూడదని, ఎవ్వరికి ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ హయాంలో కార్పోరేషన్లు, బోర్డులలో విడుదలైన నిధులు ఏం చేశారు ? అని ఆడిటింగ్ కూడా నిర్వహించాలని సీఎం సిద్దరామయ్య సంబంధిత అధికారులకు సూచించారని తెలిసింది.

అయితే సీఎం సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుపట్టంది. రూల్స్ ప్రకారం కార్పోరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల అధ్యక్షులు వారి పదవి కాలం పూర్తి అయ్యే వరకు ఆపదవుల్లో ఉండటానికి అవకాశం ఉందని, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న సిద్దరామయ్య ఆ పదవులు అన్ని రద్దు చెయ్యడం న్యాయం కాదని బీజేపీ విమర్శిస్తోంది.
సోమవారం రాత్రి నుంచి అన్ని కార్పోరేషన్లు, బోర్డుల అధ్యక్ష పదవులు, డైరెక్టర్ల పదవులు అన్ని రద్దు అయ్యాయని, మంగళవారం నుంచి వారి అధికారం చెల్లదని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. కార్పోరేషన్లు, బోర్డు అధ్యక్ష పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కూర్చోపెట్టడానికి సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications