హాట్ న్యూస్, సీఎం ఇంటికి వాటర్ కట్, వాటర్ ప్రాబ్లమ్ తో ట్యాంకర్లతో నీళ్లు సరఫరా, దెబ్బతో !
ఖాళీ బిందెలు, ఎండిపోయిన కుళాయిలు, తాగు నీటి ట్యాంకర్ వస్తుందా అని ఎదురు చూస్తున్న జనం, ఇది బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో రోజూ కనిపిస్తున్న దృశ్యాలు. ఎక్కడ చూసినా నీటి కోసం జనం అల్లాడుతున్నారు. నీళ్లు లేవు, నీళ్లు రావడం లేదు, నీళ్లు దొరకడం లేదు అంటూ ప్రజలు నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీళ్లు లేక ప్రజలు సతమతం అవుతున్నారు.
అయితే ఇప్పుడు ఓ షాకింగ్ సీన్ వెలుగులోకి వచ్చింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య కార్యాలయానికి కూడా నీటి సమస్య ఎదురైందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక రాష్ట్రంలో నీటి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. బెంగళూరులో నీటి సమస్య తక్కువగా ఏమీ లేదు. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్దరామయ్య అధికారిక కార్యాలయం కూడా నీటి సమస్యతో సతమతమవుతోంది. బెంగళూరులోని కుమారకృప రోడ్డులోని సీఎం సిద్దరామయ్య కార్యాలయానికి జలమండలి అధికారులు ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.

సీఎం సిద్దరామయ్య కార్యాలయంలో నీళ్లు లేవన్న వార్త ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. సీఎం కార్యాలయంలో నీళ్లు లేకుంటే ఏం జరుగుతుందోనని ప్రజలు చర్చ మొదలుపెట్టారు. వేసవి ఇంకా ప్రారంభం కాలేదు. మొదట కర్ణాటకలోని డ్యామ్‌లలో నీరు కనిపించడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటి వనరులు ఎండిపోయాయి. రానున్న రోజుల్లో తాగునీరు అందక భయాందోళనకు గురికావలసి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అందుకే వేసవికి ముందే బెంగళూరు నీటి కరువును ఎదుర్కొంటోంది. అంతే కాదు బెంగళూరులో ఇప్పటికే తాగునీటి ట్యాంకర్ల మాఫియా కూడా మొదలైంది. దీనిపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ సమావేశం నిర్వహించి వాటర్ ట్యాంకర్ మాఫియాను అడ్డుకునేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. తాగునీటి ట్యాంకర్ మాఫియాను అరికట్టేందుకు సీఎం సిద్దరామయ్య స్వయంగా సభ కూడా నిర్వహిస్తారని డీకే శివకుమార్ చెప్పారు.
ఈలోగా సీఎం సిద్దరామయ్య కార్యాలయంలో నీళ్లు లేకపోవడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా సీఎం కార్యాలయానికి నీటి సరఫరాను చెయ్యడం మొదలుపెట్టారు. ఇది చూసిన బెంగళూరు ప్రజలు ఇక ముందు బెంగళూరు నగరంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠకు గురవుతున్నారు. ఈ దుస్థితిలో సామాన్య ప్రజలు ఒక గ్లాసు నీరు పట్టుకోవడం కోసం వేచిచూసే పరిస్థితి ఎదురౌతుందని బెంగళూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో నీటి సమస్యపై అధికారులు దృష్టిసారించాలని, లేకుంటే భయంకరమైన నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు.
బెంగళూరులో నీటి సంక్షోభం:
బెంగళూరు నగరం తీవ్ర నీటి సమస్యతో అల్లాడుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం నీటి పంపిణీని సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ బెంగళూరు నగరంలోని బోర్‌వెల్‌ల నుండి నీటిని సేకరించి బెంగళూరు ప్రజలకు సరఫరా చేసే అన్ని నీటి ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని హామీ ఇస్తున్నారు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం కేఆర్‌ఎస్ డ్యాంలో నీటిమట్టం వేగంగా పడిపోవడంతో బెంగళూరులో నీటి సరఫరా తగ్గిపోయింది.
ఈ కేఆర్ఎస్ డ్యామ్ బెంగుళూరుకు తాగునీటికి ప్రధాన వనరుగా పనిచేస్తుంది. బీడబ్ల్యూఎస్ఎస్ బీ బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా చెయ్యడానికి ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ వాటర్ ట్యాంక్ ఏజెన్సీల సహకారం తీసుకుంటామని, తరువాత నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండవని డీసీఎం డీకే శివకుమార్ హామీ ఇచ్చారు.

అందువల్ల బెంగళూరు నగరంలోని పౌర సంస్థ, బృహత్ బెంగళూరు మహానగర పాలికే, తాగునీటి ట్యాంకర్ యజమానులందరూ తమతమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు అంటున్నారు. గత ఏడాది చివరిలో తమిళనాడుకు కావేరీ నీరు వదిలేయడంతో బెంగళూరులో ఇప్పుడు నీటి సమస్యల ఎదురైయ్యిందని సిద్దరామయ్య ప్రభుత్వం మీద ప్రజలు మండిపడుతున్నారు.
-
కర్ణాటకలో 'రోహిత్ వేముల చట్టం'..! కుల వివక్షను అరికట్టేందుకే.. -
సీఎంగా NTR! ఫ్యాన్స్ కు క్లాస్: యంగ్ టైగర్ న్యూ లుక్ వైరల్! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications