
CM son: మీకు దమ్ముంటే ఆపని చెయ్యండి, మా పార్టీ సింబల్, మా తాత ఫోటోలు, సీఎం కొడుకు వార్నింగ్ !
ముంబాయి/గుహవాటి: మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు సవాలు చేశారు. మీకు దమ్ముంటే మా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని, ప్రజల సమక్షంలో ఎవరు ఏమిటో అనే విషయం తేల్చుకుందామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే సవాలు చేశారు. మా పార్టీ టిక్కెట్లు తీసుకుని, మా తాత, తండ్రి ఫోటోలు పెట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారనే విషయం గుర్తు పెట్టుకోవాలని రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్యా ఠాక్రే సూచించారు. మీరు పార్టీ మారుతారో, లేక స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారో మాకు అనవసరం, ముందు మా పార్టీ సింబల్ తో గెలిచిన మీరు వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్దం కావాలని శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్యా ఠాక్రే సవాలు చేశారు.

చిన్నగా దాడులు మొదలైనాయి
వారం రోజుల నుంచి రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబాయి వస్తారని ఎదురు చూసిన సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గీయులు ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేల సినిమా చూపించాలని డిసైడ్ అయ్యారు. శివసేన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలను శివసేన కార్యకర్తలు ధ్వంసం చెయ్యడం మొదలుపెట్టారు.

సీఎం ముందుకు వచ్చి నిలబడాలి
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద, శివసేన పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఊహించని గతిపడుతుందని శివసేన నాయకులు రెబల్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన సీఎం ఉద్దవ్ ఠాక్రే భార్య రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చించి కుటుంబ రాజకీయాలకు తెరలేపారు.

సీఎం కొడుకు ఎంట్రీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రేకి పెత్తనం ఎక్కువ అయ్యిందని, ప్రతి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటున్నారని శివసేన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆరోపించారు. ఇదే సమయంలో ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే రంగంలోకి దిగారు.

రెబల్ ఎమ్మెల్యేలకు సవాల్
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే బహిరంగ సవాలు చేశారు. మీకు దమ్ముంటే మా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని, ప్రజల సమక్షంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎవరు ఏమిటో తేల్చుకుందామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే సవాలు చేశారు.

శివసేన జెండా, మాతాత, మాతండ్రి ఫోటోలు పెట్టుకున్నారు
మా పార్టీ టిక్కెట్లు తీసుకుని, మా తాత, తండ్రి ఫోటోలు పెట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారనే విషయం గుర్తు పెట్టుకోవాలని రెబల్ ఎమ్మెల్యేలకు సీఎం కుమారుడు ఆదిత్యా ఠాక్రే గుర్తు చేశారు. మీరు పార్టీ మారుతారో, లేక స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారో మాకు అనవసరం అని ఆదిత్యా ఠాక్రే అన్నారు

రాజీనామాలు చెయ్యండి
మీరు మా పార్టీ సింబల్ తో గెలిచి మా మీద తిరగబడుతున్నారు, మీరు వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్దం కావాలని శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్యా ఠాక్రే సవాలు చేశారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే సవాలుతో మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా వేడెక్కాయి.