కోల్‌గేట్: ఎఫ్ఐఆర్‌లో కుమారమంగళం బిర్లా, హిందాల్కో

ఈ కేసుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌లోని హైదరాబాద్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా, మహారాష్ట్రలోని ముంబైలో సిబిఐ తనిఖీలు చేస్తోంది. తద్వారా బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ సోదాలు మళ్లీ ముమ్మరం చేసింది. భువనేశ్వర్‍లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బొగ్గు కుంభకోణం కేసు ఛార్జీషీటులో తాజాగా 14వ ఎఫ్ఐఆర్‌ను సిబిఐ దాఖలు చేసింది. ఛార్జీషీటులో కుమార మంగళం బిర్లా, పరేఖ్ పేర్లను కొత్తగా చేర్చింది. వీరితో పాటు నాల్కో, హిందాల్కోలను ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
తాజా ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండటంతో కుమార మంగళం బిర్లా చిక్కుల్లో పడ్డారు. కాగా, 1993 నుండి 2011 వరకు కేటాయించిన 192 బొగ్గు గనుల కేటాయింపుపై సిబిఐ విచారణ జరుపుతోంది.


Click it and Unblock the Notifications