కాఫీ డే కింగ్ సిద్దార్థ గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ రూ. 2,700 కోట్లకు సేల్, అమెరికా, సాలర్ పురియా!

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ ఆకస్మిక మరణంతో ఆయన యజమాని అయిన సీడీఇఎల్ కంపెనీకి చెందిన బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ను విక్రయిస్తున్నారు. వి.జి. సిద్దార్థ ఆకస్మిక మృతితో కాఫీ డే నష్టాల్లో కూరుకుపోయింది. కాఫీ డే సంస్థను నష్టాల నుంచి రక్షించడానికి గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ను విక్రయిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

రూ. 2,700 కోట్ల ఆస్తి

రూ. 2,700 కోట్ల ఆస్తి

బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ లో వి.జి. సిద్దార్థకు చెందిన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ఉంది. గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ను రూ.2,700 కోట్లకు విక్రయిస్తున్నామని కాఫీ డే ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (సీడీఇఎల్) అధికారికంగా దృవీకరించింది. రూ.2,000 కోట్లకు, తరువాత రూ. 700 కోట్లకు గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ను రెండు విడతలుగా విక్రయిస్తున్నామని సీడీఇఎల్ సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 31లోపు గ్లోబల్ విలేజ్ విక్రయాల ప్రక్రియ పూర్తి అవుతుందని సీడీఇఎల్ తెలిపింది.

సీడీఇఎల్ అప్పులు రూ. 3,472 కోట్లు

సీడీఇఎల్ అప్పులు రూ. 3,472 కోట్లు

2019 జులై 31 నాటికి సీడీఇఎల్ అప్పులు రూ. 3,472 కోట్లు. గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ రూ. 2,700 కోట్లకు విక్రయిస్తే సీడీఇఎల్ అప్పుల భారి నుంచి కొంచెం బయటపడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాఫీ డే యజమాని వి.జి. సిద్దార్థ మృతి తరువాత సీడీఇఎల్ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది.

ఎవరికి విక్రయం !

ఎవరికి విక్రయం !

అమెరికాకు చెందిన బ్లాక్ స్టోన్, సాలర్ పురియా సత్వా కంపెనీలు గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ను కొనుగోలు చేస్తున్నాయి. అమెరికాలోని బ్లాక్ స్టోన్ కంపెనీ 80 శాతం వాటాలు, సాలర్ పురియా సంస్థ 20 శాతం వాటాలను (గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్) కొనుగోలు చేస్తున్నాయని సీడీఇఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపాయి.

రూ. 3,472 కోట్ల నుంచి రూ.4,970 కోట్లు

రూ. 3,472 కోట్ల నుంచి రూ.4,970 కోట్లు

2019 జులై 31వ తేదీకి సీడీఇఎల్ అప్పులు రూ. 3,472 కోట్లు. వి.జి. సిద్దార్థ మృతితో కాఫీ డే షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. సీడీఇఎల్ అప్పులు రూ. 4,970 కోట్లకు చేరిపోయాయి. తరువాత జరిగిన సమావేశంలో సీడీఇఎల్ సంస్థ ఐడీఎఫ్ సీ గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ను విక్రయించి అప్పులు తీర్చాలని నిర్ణయించామని సీడీఇఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరో సంస్థ విక్రయం !

మరో సంస్థ విక్రయం !

వి.జి. సిద్దార్థకు చెందిన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ తో పాటు మరో సంస్థ సోశియల్ లాజిస్టిక్ సంస్థను విక్రయించడానికి సిద్దం అయ్యారని సమాచారం. వీటి అప్పుల విలువ రూ. 1,488 కోట్లు. ఈ రెండు సంస్థలు విక్రయించి కంపెనీని నష్టాల భారి నుంచి బయటకే తీసుకురావాలని సీడీఇఎల్ సంస్థ నిర్ణయించిందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+