ప్రేమకు 'నో'చెప్పినందుకు ఎటాక్ : ఫేస్‌బుక్ పరిచయంతో..
చెన్నై : సోషల్ మీడియా బంధుత్వాలు బలంగా పాతుకుపోతున్న రోజులివి. పరిచయాలు, ప్రేమలు, వగైరా వాటన్నింటికీ సోషల్ మీడియా ఇప్పుడో పెద్ద వేదిక. సోషల్ మీడియాను మ్యాట్రిమోనియల్ సైట్ లా వాడేవారికి కూడా కొదువ లేదు. అమ్మాయిల ప్రొఫైల్స్ ను చూడడం.. గాలమేయాలని ప్రయత్నించడం ఆకతాయిలకు ఓ అలవాటుగా మారిపోయింది.
ఇదే తరహాలో సోషల్ మీడియాలో పరిచయమైన ఓ అమ్మాయిపై ప్రేమ పేరిట దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. కనగలక్ష్మి భారతీయర్ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోన్న ఓ అమ్మాయికి ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు వెంబురాజ్ అనే ఓ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్. వెంబురాజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అమ్మాయి యాక్సెప్ట్ చేయడంతో.. ఇద్దరి మధ్య చాటింగ్ లు మొదలయ్యాయి.

ఇదే క్రమంలో అమ్మాయిని ఓసారి డైరెక్ట్ గా కలవాలనే ఉద్దేశ్యంతో బుధవారం నాడు భారతీయర్ యూనివర్సిటీకి వెళ్లాడు వెంబురాజ్. అమ్మాయిని కలిసిన వెంటనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో.. బాటిల్ తో పొడిచి అక్కడినుంచి పరారయ్యేందుకు యత్నించాడు. ఇంతలో పోలీసులు అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు బస్టాప్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications