రాంగ్ కాల్: కూతురికి ఫోన్ చేసి వేధింపులు.. తల్లితో డిస్కష్.. ఇంటికి పిలిచి మరీ..

నంబర్ దొరికితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతారు. అయితే కొన్నిసార్లు రాంగ్‌గా డయల్ చేసి.. మరీ టార్చర్ చేస్తుంటారు. తమిళనాడులో గల కోయంబత్తూర్‌లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. 46 ఏళ్ల పెరిస్వామి బుద్ది గడ్డి తిన్నది. అనుకొకుండా డయల్ చేసిన నంబర్ నుంచి లేడీ గొంతు వినిపించింది. ఇంకేముంది ఆమె తన కూతురు వయసు అని కూడా చూడలేదు. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. అతని మాటలతో ఆ మహిళ విసుగెత్తిపోయింది. ఏం చేయాలా దేవుడా అని ఆలోచించింది.

అసభ్య పదజాలంతో దూషణ

అసభ్య పదజాలంతో దూషణ

అతను వాడుతోన్న అసభ్య భాషను రికార్డ్ చేసింది. తన తల్లి రాజీకి (50) వినిపించింది. దీంతో తల్లి ఒక ఎత్తు వేసింది. ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. అనుకున్నట్టే పెరియాస్వామి ఇంటికొచ్చాడు. సదరు యువతితోపాటు తల్లి కూడా ఉంది. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగింది. అతనిపై వారి పిడిగుద్దులు కురిపించారు. తమ కసీ తీరా కొట్టారు. వారి బరి నుంచి తప్పించుకునేందుకు పెరియాస్వామి ప్రయత్నించారు. చివరికీ ఎలాగోలా తప్పించుకొని.. రోడ్డుమీదకొచ్చాడు.

దెబ్బలు తగలడంతో మృతి

దెబ్బలు తగలడంతో మృతి

అప్పటికే దెబ్బలు బాగా తగలడంతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వారు వచ్చేసరికి అతను చనిపోయాడు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అతనిని పెరియాస్వామిగా గుర్తించారు. అతని కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. పెరియాస్వామిపై దాడి చేసిన తల్లి కూతుళ్లపై హత్యాయత్నం 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వారిద్దరినీ జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు.

Recommended Video

    A Man Cheating Women Behind Mask || మాస్క్ మాటున మాయగాడు.!
    తప్పే కానీ..

    తప్పే కానీ..

    స్థానికంగా మాత్రం ఈ ఘటన కలకలం రేపింది. అతను వేధించడం తప్పే కానీ.. చచ్చేవరకు కొట్టడం ఏంటీ అని పెదవి విరుస్తున్నారు. మరికొందరు అతనికి తగిన శాస్తి జరిగిందని చెబుతున్నారు. వేధిస్తే ఇలా కాక మరెలా చేయాలని ప్రశ్నిస్తున్నారు. కానీ చట్టపరంగా అతనిపై అభియోగాలు మోపి అదుపులోకి తీసుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+