సీఎంపై అసత్య ప్రచారం, టీవీ చానల్ పై ఫిర్యాదు, విదేశాల్లో చికిత్స అంటూ వార్తలు, తమాషా నా?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నారని, బెళగావి అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దం అయ్యారని టీవీ 5 కన్నడ టీవీ చానల్ లో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ జేడీఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైసూరు, హాసన్ జిల్లాల్లో బుధవారం సీఎం కుమారస్వామి ప్రభుత్వ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గోన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, అయినా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా టీవీ 5 టీవీ కన్నడ చానల్ లో తప్పుడు ప్రచారం చేశారని జేడీఎస్ బెంగళూరు నగర జిల్లా అధ్యక్షుడు ఆర్. ప్రకాష్ ఆరోపించారు.

టీవీ 5 చానల్ కన్నడ రిపోర్టర్ దశరథ్ సీఎం కుమారస్వామి ఆరోగ్యం విషయంలో, పదవి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వార్తలు ప్రసారం చేశారని, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారని, వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జేడీఎస్ నాయకుడు ఆర్. ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, రాజీనామా చేస్తున్నానని వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని సీఎం కుమారస్వామి అన్నారు. దేవుడి ఆశీర్వాదంతో రోజు కు 16 నుంచి 20 గంటలు తాను ప్రజాసేవ చేస్తున్నానని, తాను క్షేమంగానే ఉన్నానని
సీఎం కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications