బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు ఐదు రోజులు షరుతులతో పెరోల్, చెన్నై సిటీ పోలీసు కమిషనర్ దే పూర్తి బాధ్యత!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు ఎట్టకేలకు పెరోల్ మంజూరు చేశారు. ఐదు రోజుల పాటు చెన్నైలో శశికళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త నటరాజన్ ను చూసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 15 రోజులు పెరోల్ కావాలని శశికళ చేసిన మనవిని తిరస్కరించిన అధికారులు కేవలం ఐదు రోజులు మాత్రమే పెరోల్ మంజూరు చేశారు.

శుక్రవారం శశికళకు షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేస్తూ కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శశికళ పెరోల్ మీద తమిళనాడు వస్తే ఆమెకు ఎలాంటి భద్రత కల్పిస్తారు అంటూ కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు చెన్నై నగర పోలీసు కమిషనర్ ను వివరణ అడిగారు.

శశికళకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని చెన్నై నగర పోలీసు కమిషనర్ శుక్రవారం ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. చెన్నై నగర పోలీసు కమిషనర్ పంపించిన ఈ మెయిల్ పరిశీలించిన కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు శశికళకు పెరోల్ ఇచ్చే విషయంలో ఉన్నతాధికారులతో చర్చించారు.

పెరోల్ మీద బయటకు వెళ్లడానికి శశికళకు అర్హత లేకున్నా ఆమె భర్త నటరాజన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనే ఒక్క కారణంతో మానవత్వంతో పెరోల్ మంజూరు చేశామని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు. శశికళను చెన్నై పిలుచుకుని వెళ్లడానికి టీటీవీ దినకరన్ బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు బయట వేచి చూస్తున్నాడు.

English summary
Conditional parole granted for Sasikala Natarajan for 5 days to visit her ailing husband Natarajan by Parappana Agrahara Central Prison authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X