Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుద్ధం అక్కడ.. దెబ్బ ఇక్కడ : రూ. 8,000 కోట్లు ఫసక్ ? అసలేం జరుగుతోంది ??

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాలు భారతదేశంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే LPG సరఫరా తగ్గడం, సిలిండర్ ధరలు పెరగడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి.

కండోమ్ పరిశ్రమపై ఎఫెక్ట్..

ఇప్పుడు ఈ ప్రభావం ఆరోగ్య రంగానికి విస్తరించింది. ముఖ్యంగా కండోమ్ తయారీ పరిశ్రమ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ముడిసరుకుల సరఫరా ఆలస్యం కావడంతో ఉత్పత్తి మందగించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో కండోమ్ ధరలు గణనీయంగా పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

condom-industry-in-india-facing-issues-due-to-impact-of-middle-east-conflicts-that-war-between-iran

ప్రముఖ కంపెనీలకు సరఫరా సమస్యలు..

దేశంలోని ప్రముఖ కండోమ్ తయారీ సంస్థలు అయిన HLL Lifecare
, Cupid Limited
, Mankind Pharma
ప్రస్తుతం ముడిసరుకుల డెలివరీలో తీవ్ర ఆలస్యాలను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ సరఫరా మార్గాలు దెబ్బతినడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది.

హోర్ముజ్ జలసంధి కీలక పాత్ర..

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద షిప్పింగ్ అంతరాయాలు ఏర్పడటం ప్రధాన కారణంగా మారింది. ఈ మార్గం ద్వారా జరిగే సరఫరా మందగించడంతో అనేక పరిశ్రమలు ప్రభావితమయ్యాయి. మరి ముఖ్యంగా కండోమ్ తయారీలో అవసరమైన ముఖ్య పదార్థాలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. లూబ్రికేషన్ కోసం ఉపయోగించే సిలికాన్ ఆయిల్ దొరకడం కష్టమవుతోంది. అలాగే లేటెక్స్ ప్రాసెసింగ్‌లో ఉపయోగించే అనైడ్రస్ అమ్మోనియా ధరలు 40-50 శాతం పెరిగాయి.

దీంతో భారతదేశం లేటెక్స్ తయారీలో అవసరమైన అమ్మోనియాలో సుమారు 86% ను సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ దేశాల నుంచి సరఫరా తగ్గడం వల్ల ఉత్పత్తి దెబ్బతింది. అంతే కాకుండా ముడిసరుకుల కొరతతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు కూడా పెరిగాయి. అల్యూమినియం ఫాయిల్, PVC వంటి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం మరింతగా పెరిగింది. దీంతో తయారీదారులు ధరలను పెంచే పరిస్థితి ఏర్పడింది.

మొత్తంగా భారత కండోమ్ పరిశ్రమ సుమారు ₹8,000 కోట్లకు పైగా విలువ కలిగి ఉంది. ఏటా దాదాపు 400 కోట్ల కండోమ్‌లు ఉత్పత్తి అవుతాయి. కానీ ప్రస్తుతం ముడిసరుకుల కొరత, పెరుగుతున్న ఖర్చులు పరిశ్రమను ఒత్తిడిలోకి నెట్టాయి. Rajeev Jayadevan ప్రకారం, ధరల పెరుగుదల వల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలు కండోమ్ వినియోగాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. దీని వల్ల అనుకోని గర్భాలు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STIs) పెరిగే అవకాశం ఉంది. తల్లి, శిశు ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చని అంటున్నారు.

ఇతర పరిశ్రమలపై కూడా దెబ్బ..

ఈ సంక్షోభం కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా.. నిర్మాణ రంగంలో LNG, ఇంధన ధరల పెరుగుదల వల్ల సిమెంట్, స్టీల్ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. మోర్బి ప్రాంతంలోని సెరామిక్ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించాయి. అలాగే ఫిరోజాబాద్ లో గాజు పరిశ్రమ 30-40 శాతం ఉత్పత్తిని తగ్గించింది. దీనివల్ల బాటిల్స్ సరఫరా దెబ్బతిని ఔషధాలు, పర్ఫ్యూమ్, పానీయాల రంగాలపై ప్రభావం పడుతోంది.

అయితే ప్రస్తుత పరిస్థితి కొనసాగితే కండోమ్ ధరలు మరింత పెరగడం, సరఫరా కొరత పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా చిన్న తయారీదారులు మార్కెట్ నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని సరఫరా స్థిరీకరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+