Video: నైటీలతో వచ్చి ఏటీఎంను లూటీ చేశారు.. ఈ దొంగలు మామూలోళ్లు కాదు బాబోయ్!

Video: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగుచూసింది. దొంగలు పోలీసులకు కంటపడకుండా, గుర్తుపట్టకుండా ఉండేందుకు నైటీలు ధరించి ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి నగదును అపహరించుకెళ్లారు. ఈ వినూత్న చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఏజెంట్ దగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో తెలంగాణ యువకుడు మృతి?
ఏజెంట్ దగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో తెలంగాణ యువకుడు మృతి?

సీసీటీవీ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. నైటీ, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి మొదట ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి యంత్రంపై ఓ రకమైన గ్యాస్ స్ప్రే చేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి పదునైన ఆయుధంతో లోపలికి వచ్చి ఏటీఎం ముందు భాగాన్ని తెరిచాడు. అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో మంటలు పుట్టించి ఏటీఎంను ముక్కలుగా కట్ చేసి అందులోని నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు.

Caught on Camera Men in Nighties Loot Kamareddy ATM with Gas Cutter CCTV Video Viral Full Details
 వేసవిని తలపిస్తున్న అక్టోబర్ ఎండలు - అప్పటి వరకు ఇంతే, తాజా అలర్ట్స్..!!
వేసవిని తలపిస్తున్న అక్టోబర్ ఎండలు - అప్పటి వరకు ఇంతే, తాజా అలర్ట్స్..!!

ఘటనపై సమాచారం అందుకున్న గాంధారి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎం నుంచి ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైందనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని, విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 303 కింద కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+