ఆర్బీఐకి సైతం చుక్కాని: ఫైనాన్షియల్ మోడల్ సృష్టికర్తలకు నోబెల్

ప్రముఖ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఇ. హాల్, మైఖేల్ ఉడ్‌ఫోర్డ్‌లకు ఎకనమిక్స్ లో నోబెల్ బహుమతి వరించింది. స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించడం కోసం మైక్రోఎకనామిక్ ఫౌండేషన్స్ విజయవంతంగా ఏర్పాటు చేసినందుకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాన్ని వారికి ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను తీవ్ర ద్రవ్యోల్బణం, మాంద్యం ముప్పుల నుంచి కాపాడటంలో వీరి పరిశోధనలు అత్యంత కీలక పాత్ర పోషించాయని నోబెల్ కమిటీ తెలిపింది.

సాధారణంగా స్థూల రంగానికి చెందిన గణాంకాలు, చారిత్రక డేటా ఆధారంగా మాత్రమే ఆర్థిక విధానాలను రూపుదిద్దుకుంటుంటాయి. రాబర్ట్ హాల్, మైఖేల్ ఉడ్‌ఫోర్డ్ ల పరిశోధనలు ఆర్థిక అధ్యయనంలో ఓ నూతన విప్లవాన్ని తీసుకొచ్చాయి. సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ గమనం అనేది సమాజంలోని వ్యక్తిగత కుటుంబాలు, వ్యాపార సంస్థలు తీసుకునే సూక్ష్మ స్థాయి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని గణాంకాలతో సహా నిరూపించారు.

Royal Swedish Academy award the 2026 Nobel Prize in Economic to Robert E Hall and Michael Woodford

ఈ పరిశోధనలే న్యూ కేన్సియన్ మోడల్ ఆవిర్భావానికి పునాదిగా వేశాయి. న్యూ కేన్సియన్ మోడల్.. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, ఆయా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖల పనితీరును సమూలంగా మార్చివేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయం, ద్రవ్యోల్బణ నియంత్రణ, బడ్జెట్ విధాన రూపకల్పనలో ఈ పద్ధతులనే అనుసరిస్తోన్నాయి.

కాక్రోచ్ ల దెబ్బకు..: జంతర్ మంతర్ ఇక ధర్నాలకు వేదిక కాదు: కేంద్రం తాజా నిర్ణయం: సర్కులర్
కాక్రోచ్ ల దెబ్బకు..: జంతర్ మంతర్ ఇక ధర్నాలకు వేదిక కాదు: కేంద్రం తాజా నిర్ణయం: సర్కులర్

ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా వచ్చే తీవ్ర హెచ్చుతగ్గులను తగ్గించడం, సుస్థిర ప్రగతిని సాధించడానికి న్యూ కేన్సియన్ మోడల్ ఓ మార్గదర్శిగా నిలిచింది. రాబర్ట్ ఇ. హాల్ 1978లోనే వినియోగదారుల ఆలోచన విధానంపై ఓ రీసెర్చ్ పేపర్ ను రూపొందించారు. ప్రజల రోజువారీ వినియోగంలో వచ్చే మార్పులను ముందస్తుగా ఊహించడం సాధ్యం కాదని, మార్కెట్ లో లభించే తాజా సమాచారం ఆధారంగానే వారు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారని ఆయన వెల్లడించారు.

గుర్తుంచుకోండి.. ఇప్పుడు యావత్ దేశం జంతర్ మంతరే: అభిజిత్ దిప్కే
గుర్తుంచుకోండి.. ఇప్పుడు యావత్ దేశం జంతర్ మంతరే: అభిజిత్ దిప్కే

ఆర్థిక వ్యవస్థలో వినియోగధోరణులను విశ్లేషించే ఆధునిక మాక్రో ఎకనామిక్స్ పరిశోధనలకు ఆయన అందించిన సిద్ధాంతమే ప్రధాన ప్రాతిపదికగా మారింది. సరఫరా- డిమాండ్ వ్యవస్థలలో ఏర్పడే షాక్స్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన మోడల్స్ ను రూపొందించారు.. మైఖేల్ ఉడ్‌ఫోర్డ్. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడినా, యుద్దాల వల్ల విపత్తులు ఎదురైనా, ఉత్పత్తి పెరిగినా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచుతూ ఆర్థిక వ్యవస్థలను ఎలా సమతుల్యం చేయవచ్చనేది తన పరిశోధనల ద్వారా స్పష్టంగా వివరించారు.

ఈ ఇద్దరి సుదీర్ఘ పరిశోధనల ఫలితంగానే ఇటీవల కాలంలో ప్రపంచాన్ని కుదిపివేసిన కోవిడ్ మహమ్మారి, క్రూడ్ సంక్షోభం వంటి కష్టకాలంలో కూడా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కూలిపోకుండా నిలదొక్కుకోగలిగాయి. 1930ల కాలం నాటి తీవ్ర ఆర్థిక మాంద్యం లేదా 1970ల నాటి దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా నివారించడంలో ఈ మైక్రోఎకనమిక్స్ మోడల్స్.. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఎంతగానో సహాయపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+