మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్ల ప్రకటన - ఎవరికి ఏ సీటు, లిస్టు ఇలా..!!
స్థానిక ఎన్నికల కసరత్తు తుది దశకు చేరింది. ఈ నెల 14న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల కు రంగం సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. మేయర్ తో పాటుగా మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో, పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేస్తున్నాయి. రేపు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 17 నగరపాలక సంస్థలు, 106 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వారీగా కేటాయించే స్థానాలపై నిర్ణయం పూర్తయింది. జనాభా నిష్పత్తి, రొటేషన్ ఆధారంగా వీటిని ఖరారు చేసారు. ఈ నెల 14న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. మొత్తం 17 మేయర్ పదవులకు ఎస్టీ -1, ఎస్సీ- 2, బీసీ-5, మహిళలకు -5, జనరల్ -4 ఖరారు చేసారు. మంగళగిరి (ఎస్టీ), కర్నూలు (ఎస్సీ మహిళ) - రాజమండ్రి (ఎస్సీ జనరల్)కు కేటాయించారు. బీసీ జనరల్ : ఏలూరు, అనంతపురం, చిత్తూరు - బీసీ మహిళలకు కాకినాడ, మచిలీపట్నం ఖరారు చేసారు. ఇక.. జనరల్ మహిళలు: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప కేటాయించగా.. ఓపెన్ కేటగిరిలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు ప్రకటించారు.

రిజర్వేషన్లు ఖరారు.. అభ్యర్దుల ఎంపిక పై కసరత్తు
అదే విధంగా రాష్ట్రంలోని 106 పురపాలక సంఘాల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 శాతం చోట్ల మహిళలకు ఛైర్‌పర్సన్ పదవులు దక్కనున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, కార్పొరేషన్లను 2021 ఎన్నికల్లో జనరల్ మహిళలకు కేటాయించారు. ఇక 106 మున్సిపాల్టీల్లో ఎస్టీ-3, ఎస్సీ: 14, బీసీ 36, జనరల్ మహిళ - 27, అన్ రిజర్వ్‌డ్ -26 గా ఖరారు చేసారు. ఎస్టీ: 3 - మహిళ కు గూడూరు, జనరల్ ఆలూరు, ఆత్మకూరు కేటాయించారు. ఎస్సీ: 14 - మహిళలు (7): చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల; జనరల్ (7): ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల ఫిక్స్ చేసారు. బీసీలకు కేటాయించిన 36 స్థానాల్లో 18 బీసీ మహిళకు ఖరారు అయ్యాయి. కాగా.. ఇప్పుడు రిజర్వేషన్లకు అనుగుణంగా కూటమి- వైసీపీ తమ అభ్యర్ధులను ప్రకటించేందుకు తుది కసరత్తు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications
