వాలెంటైన్స్ డే: ముంబైలో కండోమ్స్ పంపిణీ, 'సేఫ్ సెక్స్'కి పిలుపు..
ముంబై: ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఎహెచ్ఎఫ్ జ్యోతీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ముంబైలో కండోమ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నవీముంబైలోని వాషి రైల్వేస్టేషన్‌లో ఏడువేల కండోమ్ లను ఉచితంగా పంపిణీ చేశారు.
దేశంలో హెచ్ఐవి/ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానిపై అవగాహన కల్పించేందుకే కండోమ్స్ పంపిణీ చేపట్టామన్నారు. కండోమ్ లు వాడకుంటే మీకు లైఫ్ లేదంటూ నినాదాలు చేశారు.
సురక్షితం కాని శృంగారానికి దూరంగా ఉండాలని, వాలెంటైన్స్ డే నాడు మాత్రమే గాక.. మిగతా రోజుల్లోనూ సురక్షితమైన రొమాన్సే చేయాలని ట్రస్ట్ సభ్యులు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications