Bengaluru: ఆర్ టీసీ బస్సులోనే సజీవదహనం అయిన కండెక్టర్, ఐటీ హబ్ లో ఏం జరిగిందంటే ?
రాత్రి ఆర్ టీసీ బస్సు నిలిపిన డ్రైవర్, కండెక్టర్ భోజనం చేశారు. ఆర్ టీసీ బస్సులోనే నిద్రపోయిన కండెక్టర్ అదే బస్సులోనే సజీవదహనం కావడం కలకలం రేపింది.
బెంగళూరు/బళ్లారి: ఆర్ టీసీలో కండెక్టర్ ఉద్యోగం రావడవతో సంతోషించాడు.ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్ని భార్య, పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రతినిత్యం అధికారులు కేటాయించిన రూట్ లో కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి డ్యూటీ ముగించుకుని ఉదయం మళ్లీ అదే రూట్ లో డ్యూటీ చెయ్యవలసి ఉంది. రాత్రి ఆర్ టీసీ బస్సు నిలిపిన డ్రైవర్, కండెక్టర్ భోజనం చేశారు. ఆర్ టీసీ బస్సులోనే నిద్రపోయిన కండెక్టర్ అదే బస్సులోనే సజీవదహనం కావడం కలకలం రేపింది.

బీఎంటీసీలో కండెక్టర్ ఉద్యోగం
కర్ణాటకలోని బళ్లారికి చెందిన ముత్తయ్య స్వామి (45) అనే వ్యక్తికి బెంగళూరులోని బీఎంటీసీలో కండెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. బెంగళూరు చేరుకున్న ముత్తయ్య స్వామి సుమ్మనహళ్లి డిపో-31లో కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ముత్తయ్య స్వామి ప్రతిరోజు డి గ్రూప్ లేఔట్ రూట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం డ్రైవర్ ప్రకాష్ తో పాటు ముత్తయ్య స్వామి విధులకు హాజరైనాడు.

ఆర్ టీసీ బస్సులో నిద్రపోయిన కండెక్టర్
రాత్రి 11 గంటల సమయంలో డి గ్రూప్ లేఔట్ లోని బీఎంటీసీ బస్ స్టాప్ లో కేఏ 57 ఎఫ్-2069 బస్సు పార్క్ చేసిన డ్రైవర్ ప్రకాష్, కండెక్టర్ ముత్తయ్య స్వామి బస్సులో భోజనం చేశారు. రాత్రి 12 గంటల సమయంలో డ్రైవర్ ప్రకాష్ బీఎంటీసీ బస్ షెల్టర్ లోకి వెళ్లి నిద్రపోయాడు. కండెక్టర్ ముత్తయ్య స్వామి బీఎంటీసీ బస్సులోనే నిద్రపోయాడు.

అర్దరాత్రి బస్సులో మంటలు
అర్దరాత్రి దాటిన తరువాత బీఎంటీసీ బస్సుకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అదే బస్సులో నిద్రపోతున్న కండెక్టర్ ముత్తయ్య స్వామికి మంటలు వ్యాపించి అదే బస్సులో సజీవదహనం అయ్యాడు. గస్తీ తిరుగుతున్న సుమ్మనహళ్లి పోలీసులు విషయం గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

బస్సులోనే బూడిద అయిన కండెక్టర్
మంటలు అదుపు చేసే సమయానికి కండెక్టర్ ముత్తయ్య స్వామి అదే బస్సులో కాలి బూడిద అయ్యాడు. బీఎంటీసీ బస్సులో ఎలా మంటలు వ్యాపించాయి ? అనే విషయంలో పక్కా సమాచారం లేదని, కేసు విచారణలో ఉందని సుమ్మనహళ్లి పోలీసులు అంటున్నారు. బీఎంటీసీ బస్సులో కండెక్టర్ సజీవదహనం కావడం బెంగళూరులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications