మణిపూర్‌లో కాంగ్రెస్, వామపక్షాల కూటమి .. గెలుపుపై ధీమా..
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రసకందంగా మారాయి. మరో సారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అటు కమలం ఆశలకు గండి కోట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం రచన చేస్తోంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు పొత్తు రాజకీయాలకు తెరతీసింది. ఇందులో భాగంగా వామపక్షాలను కలుపుకోని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

మణిపూర్ ప్రొగ్రసివ్ సెక్యులర్ అలయెన్స్
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కలసి పోటీ చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు నిర్ణయించాయి. మణిపూర్ ప్రొగ్రసివ్ సెక్యులర్ అలయెన్స్ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ యేతర పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఫార్వార్డ్ బ్లాక్ , ఆర్ఎస్పీ, జేడీ( ఎస్ )లు ఈ కూటమిలో భాగస్వాలయ్యాయి. ఈ కూటమి ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ భవన్‌లో ఆరుపార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సమావేశంలో మణిపూర్ ఎన్నికల పరిశీలకులు జైరాం రమేష్, మణిపూర్ మాజీ సీఎం ఓక్రాం ఇబోబి సింగ్, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. పొత్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

అధికారంలోకి 18 పాయింట్ల ఎజెండాను అమలు
మణిపూర్‌లో తమ కూటమి అధికారంలోకి వస్తే.. 18 పాయింట్ల ఎజెండాను అమలు చేస్తామని కూటమి నేతలు తెలిపారు. ప్రజలందరికి ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక చట్టాలను తెస్తామన్నారు. నిరుద్యోగ భృతి అందిస్తామమని హామీ ఇచ్చారు. మత సామరస్యాన్ని పెంపొందించడంతో పాటు.. ఆర్థిక సమన్యాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామమని తెలిపారు.
Recommended Video

మళ్లీ అధికారం చేపట్టడం బీజేపీకి అంత ఈజీ కాదు
కాగా, బీజేపీ మళ్లీ అధికారం చేపట్టడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన జేడీయూ.. బీజేపీతో సై అంటూ ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇది బీజేపీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు ఎన్సీపీ, ఎన్పీఎఫ్ మణిపూర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమలానికి విజయం అంత తేలిక కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదిల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications