Five State Polls 2023: ఐదు రాష్ట్రాలూ గెలవబోతున్నాం-కాంగ్రెస్ ప్రకటన
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట కల్లా దాదాపు 37 శాతం ఓటింగ్ నమోదైంది. మరో నాలుగు గంటల్లో పోలింగ్ ప్రక్రియ ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళిని గమనించిన కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలవబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ, కీలక నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఈ నెలలో ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ సాయంత్రానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తవుతోంది. ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ రాజస్తాన్ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గెలవబోతోందని చెప్పేసారు. ఇవాళ తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఎన్నికల పోరు సాగింది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు సాగింది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాత్రం రెండు స్ధానిక ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పోరాడింది. ఈ ఐదు రాష్ట్రాల్లో రాజస్తాన్ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని గతంలో పలు సర్వేలు తెలిపాయి. ఇవాళ సాయంత్రానికి ఈ ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడబోతున్నాయి.
డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు కాంగ్రెస్ కు చాలా కీలకంగా మారాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ముూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో బీజేపీ హోరాహోరీ పోరాడింది.












Click it and Unblock the Notifications