జాలిచూపమని: సావర్కర్‌పై కాంగ్రెస్ వివాదస్పద ట్వీట్
న్యూఢిల్లీ: హిందూ సిద్ధాంతకర్త వీర సావర్కర్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు వివాదానికి తెరలేపింది. అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం భగత్ సింగ్‌కు నివాళులు అర్పించే సందర్భంగా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
'అమరులు' శీర్షికన భగత్ సింగ్ ఫోటోను, 'దేశద్రోహులు' శీర్షికన వీర సావర్కర్ ఫోటోను ఉంచింది. ఆ ఫోటోల పక్కన ఆనాడు జైలు నుంచి బ్రిటష్ పాలకులకు రాసిన లేఖల్లోని వ్యాఖ్యాలను ఉటంకించింది.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోపాడిన భగత్ సింగ్ ఉరిశిక్షకు గురయ్యాడని, బిజెపి - ఆరెస్సెస్ సిద్దాంతకర్త సావర్కర్ మాత్రం ఆంగ్లేయుల పాలనలో బానిసగా ఉంటానంటూతనపై జాలి చూపాల్సిందిగా వేడుకున్నాడని కాంగ్రెస్ విమర్శించింది.

భగత్ సింగ్ జైలు గది సందర్శనకు అనుమతి
భగత్ సింగ్ జైలు జీవితాన్ని గడిపిన గదిని సందర్శించడానికి విద్యార్థులను అనుమతించారు. వైస్-రీగల్ లాడ్జ్ ఎస్టేట్‌గా పిలిచే ఈ భవనంలో ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపకులపతి కార్యాలయం ఉంది.
బుధవారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఐదు పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థులను గదిని సందర్శించేందుకు అనుమతించినట్లు వైస్ ఛాన్సులర్ తెలిపారు. ప్రజా సందర్శనకు అనుమతించే ఆలోచనేది లేదని వెల్లడించారు












Click it and Unblock the Notifications