మోడీని నరికేస్తానన్న కాంగ్రెసు అభ్యర్థి అరెస్టు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాహరాన్పూర్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మసూద్ వ్యాఖ్యలను ఆ పార్టీ కూడా వ్యతిరేకించింది. హింసాపూరితమైన వ్యాఖ్యలను కూడా తాము సమర్థించబోమని కాంగ్రెసు చెప్పింది.
మసూద్ విద్వేషపూరిత వ్యాఖ్యలను బిజెపి ఖండిస్తూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా బిజెపి వివాదంలోకి లాగింది. మసూద్ చేసిన వ్యాఖ్యల వీడియో వెబ్‌లో హల్‌చల్ చేసింది. మోడీ ఉత్తరప్రదేశ్‌ను గుజరాత్ మాదిరిగా చేస్తే ముక్కలుగా నరుకుతానని మసూద్ వ్యాఖ్యానించారు.
తాను వ్యాఖ్యలకు మసూద్ క్షమాపణ కూడా చెప్పారు. తన పదజాలం పట్ల కాస్తా జాగ్రత్తగా ఉండాల్సిందని ఆయన చెప్పుకున్నారు. మసూద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు యుపి పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) ఆమరేంద్ర సెంగార్ చెప్పారు.












Click it and Unblock the Notifications