• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై సోనియాగాంధీ ఫైర్

|
Google Oneindia TeluguNews

జాతిపిత మ‌హాత్మా గాంధీ, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ పేట‌ల్‌, మౌలానా అబుల్‌క‌లామ్ ఆజాద్ లాంటి మ‌హోన్న‌త నేత‌ల‌ను కించ‌ప‌రచడానికే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండిప‌డ్డారు. రాజ‌కీయంగా త‌మ‌కు ఉప‌యోగ‌పడుతుంద‌నే ఉద్దేశంతో వీరిపై చేస్తున్న ప్ర‌చారాన్ని ఇక‌నైనా ఆపాల‌ని కోరారు. దేశ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆమె ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

75 సంవత్సరాలుగా భారత బలగాలు దేశానికి చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తోంద‌ని, అటువంటివాటిని కాంగ్రెస్ పార్టీచూస్తూ ఊరుకోబోద‌ని హెచ్చరించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ అనుస‌రిస్తోన్న ఫాసిస్టు ధోర‌ణిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. కర్నాటకలో బీజేపీ హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా నెహ్రు ఫొటోను తొలగించడంపై ఆమె తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దేశంలో గతం సాధించిన విజయాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని, వాటిని అణ‌గ‌దొక్కుతోంద‌న్నారు.

congress chief sonia gandhi comments on narendra modi

Recommended Video

అవినీతి,బంధుప్రీతి పట్ల కఠినవైఖరి చూపిస్తా... మోడీ *National | Telugu OneIndia

75 సంవత్సరాలుగా, అత్యంత ప్రతిభావంతులైన భారతీయులు అన్ని రంగాలలో దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించార‌ని, స్వేచ్ఛ‌, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థకు మ‌హానుభావులు పునాదులు వేశార‌ని, ఇప్పుడు ఆ పునాదుల‌ను కూక‌టివేళ్ల‌తో స‌హా పెకిలించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. భిన్న‌త్వంలో ఏక‌త్వంద్వారా దేశం మంచి గుర్తింపు తెచ్చుకుంద‌ని, అదే ఈ జాతికి బ‌ల‌మ‌న్నారు.

English summary
Congress president Sonia Gandhi has said that the central government is trying to defame the great leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, Sardhar Vallabhbhai Patel and Maulana Abul Kalam Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X