బీజేపీ గడ్డపై సోనియా-రాహుల్ గాంధీ..!!

బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర- ఇవ్వాళ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ యాత్ర కొనసాగుతోంది. దసరా పండగను పురస్కరించుకుని రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు భారత్ జోడో యాత్రను చేపట్టలేదు. 4, 5 తేదీల్లో దీన్ని నిర్వహించలేదు. ఈ ఉదయం మండ్య జిల్లాలోని పాండవపురలో యాత్రను చేపట్టారు. సాయంత్రానికి రామనగర జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉంది.

కిందటి నెల 30వ తేదీన అడుగు పెట్టారు రాహుల్ గాంధీ కర్ణాటకలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటెలో ఆయన కేరళ సరిహద్దులను దాటారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. భారత్ జోడో యాత్రను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అదే స్థాయిలో నిర్వహిస్తోన్నారు.

Congress Chief Sonia Gandhi joins Rahul Gandhi Bharat Jodo Yatra at Mandya in Karnataka

మైసూరులో రాహుల్ గాంధీ నిర్వహించిన బహిరంగ సభ వైరల్‌గా మారింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇవ్వాళ ఈ యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ తెల్లవారు జామునే ఆమె రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సహా పలువురు నాయకులు సోనియాను కలిశారు. ఆమెతో కలిసి నడక మొదలు పెట్టారు.

మూడు రోజుల కిందటే సోనియా గాంధీ కర్ణాటకకు చేరుకున్న విషయం తెలిసిందే. మడికెరి, మైసూరుల్లో బస చేశారు. విజయదశమి సందర్భంగా మైసూరు జిల్లాలోని బేగూర్ వద్ద గల ప్రఖ్యాత భీమనకొల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇదే యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆమె ఎప్పుడూ యాత్రలో కలుస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.

Congress Chief Sonia Gandhi joins Rahul Gandhi Bharat Jodo Yatra at Mandya in Karnataka

కర్ణాటకలో సుదీర్ఘంగా కొనసాగనుంది భారత్ జోడో యాత్ర. 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల మేర కర్ణాటక మీదుగా ఈ యాత్ర సాగనుంది. బీజేపీ పాలిత రాష్ట్రం.. కర్ణాటక. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక గాంధీ పాల్గొనబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+